E-Paper
Advertisement

పహల్గామ్ లో బాబర్ ఆజం టీ-ష‌ర్ట్స్ క‌ల‌క‌లం..26 మంది చ‌నిపోయిన చోటే !

పహల్గామ్ లో బాబర్ ఆజం టీ-ష‌ర్ట్స్ క‌ల‌క‌లం..26 మంది చ‌నిపోయిన చోటే !
Advertisement

Pahalgam:  కాశ్మీర్ లోని పహల్గామ్ లో ( Pahalgam) ఉగ్రదాడి ( Terrorists Kill ) జరిగి ఏడాది కాలం పూర్తయింది. ఈ మారణకాండ నేపథ్యంలో ఏకంగా 26 మంది దుర్మరణం చెందారు. ఇందులో విదేశీ యాత్రికలు కూడా ఉండడం విషాదకరం. అయితే ఈ సంఘటన రెండు దేశాల మధ్య చీలిక తెచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పహల్గామ్ సంఘటనతో ఈ ఘర్షణలు మరింత పెరిగాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో పహల్గామ్ సంఘటన స్థలంలోనే పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీ లు, టీషర్ట్స్ కలకలం రేపాయి.

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

పహల్గామ్ లో బాబర్ ఆజం టీ-ష‌ర్ట్స్ క‌ల‌క‌లం

Advertisement

పహల్గామ్ లో ( Pahalgam) ఉన్న కొంత మంది దుకాణపు దారులు… బాబర్ ఆజం లాంటి పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీలు, టీ షర్టులను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ( Babar Azam T-shirts), ఇతర పాకిస్తాన్ క్రికెటర్ల టీ- షర్ట్స్ వైరల్ గా మారాయి. ఇది చూసిన ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్న దేశ క్రికెటర్ల టీ షర్ట్ లను ఇండియాలో ఎలా అమ్ముతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెమైనా బుద్ధి ఉందా? వెంటనే ఆ జెర్సీలు , టీషర్ట్స్ దగ్ధం చేయాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీలు అమ్మడంపై నెటిజన్ల ఆగ్రహం

26 మందిని పహల్గామ్ ( Pahalgam Incident) ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సరిగ్గా ఏడాది కిందట జరిగింది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టింది మోడీ సర్కార్. ఆపరేషన్ సిందూర్ పేరుతో దాదాపు నెల రోజులు పాకిస్తాన్ తో యుద్ధం చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలో వంద మంది ఉగ్రవాదులను కూడా మట్టి కరిపించింది. ఇంత జరిగినా కూడా పహ‌ల్గామ్ ప్రాంతంలో ఉన్న కొంత మంది దుకాణపు దారులు… పాకిస్తాన్ క్రికెటర్ల జెర్సీలు, టీ షర్ట్స్‌ అమ్మడంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప‌హ‌ల్గామ్ ప్రాంతంలో ఇక‌పైన హిందువులు ( Hindus) ప‌ర్య‌టించ‌కూడద‌ని కొంత‌ మంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వివాదం కాశ్మీర్ పర్యాటక రంగంపై ప్రభావం చూపుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పాకిస్తాన్ క్రికెటర్ల టి షర్ట్స్‌ అమ్మడం అత్యంత దారుణం అంటూ మండిపడుతున్నారు. ఇలా టీ షర్ట్స్‌ అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని మోడీ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ టీషర్ట్ ల వివాదం పైన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి లేదా స్థానిక అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీడియోలు, ఫోటోలు మాత్రం వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

 

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×