E-Paper
Advertisement

Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?

Shoaib Malik: నాలుగో పెళ్లి చేసుకుంటున్న పాకిస్తాన్ క్రికెటర్.. ముగ్గురికి విడాకులు?
Advertisement

Shoaib Malik: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ గత కొన్నేళ్లుగా తన ఆట కంటే వివాదాల కారణంగానే తరచు వార్తల్లో నిలుస్తున్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – షోయబ్ మాలిక్ సెలబ్రిటీ స్టార్ కపుల్. వీరి ప్రేమ దేశ సరిహద్దులు దాటి.. 2010లో ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. 2018లో ఈ జంటకు ఓ మగ బిడ్డ కూడా జన్మించాడు. అయితే సానియా మీర్జా కంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఆమెతో ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోయాడు. ఆయేషా సిద్ధిఖీ అనే అమ్మాయిని రహస్యంగా వివాహమాడాడు షోయబ్ మాలిక్. ఆమె నుండి విడిపోయిన షోయబ్ మాలిక్.. ఆ వెంటనే సానియా మీర్జాని వివాహం చేసుకున్నాడు.

Also Read: CSK: మతీషా పతిరనా ఔట్.. సంజు రాకతో భయంకరంగా మారిన CSK బ్యాటింగ్ ఆర్డర్

Advertisement

సానియా మీర్జాతో కూడా విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు. 2024లో ఈ జంట విడాకులు తీసుకుంది. 14 సంవత్సరాల దాంపత్య బంధానికి 2024లో విడాకులతో ముగింపు పలికింది ఈ జంట. ఆ తర్వాత 2024లో సనా జావెద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తరచుగా ఇతర మహిళలతో అఫై** పెట్టుకోవడం వల్లనే సానియా మీర్జా విసిగిపోయి విడాకులు తీసుకున్నట్లు మాలిక్ సోదరి ఓ సంచలన విజయాన్ని బయటపెట్టింది. ఇక షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న మూడవ అమ్మాయి సనా జావెద్ కి కూడా ఇది రెండవ వివాహం. ఈమె కూడా మాలిక్ ని పెళ్లి చేసుకునేందుకు ముందు తన పాత బంధాన్ని తెంచుకుంది. అయితే ఈ వివాహం జరిగి కేవలం ఏడాదిన్నర కాకముందే ఈ బంధం కూడా విడిపోయిందనే పుకార్లు మొదలయ్యాయి.

నాలుగో పెళ్లికి సిద్ధమైన షోయబ్:

సానియా మీర్జాతో 2024లో విడాకుల అనంతరం పాకిస్తాన్ హీరోయిన్ సనా జావెద్ ని పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. ఆ తర్వాత కొంతకాలానికే తమ హ్యాపీ లైఫ్ కి చెక్ పెట్టబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు జోరుగా సాగాయి. అంతేకాకుండా ఈ జంట సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయని.. ఇక ప్రస్తుతం షోయబ్ మాలిక్.. సోనియా అనే అమ్మాయితో నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు పాకిస్తాన్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.

ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సానియా మీర్జా:

Advertisement

తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త విషయాలను బహిర్గతం చేసింది సానియా మీర్జా. ఓ యూట్యూబ్ షో లో మాట్లాడుతూ.. షోయబ్ మాలిక్ తో విడాకుల అనంతరం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి ప్రస్తావించింది. విడాకుల అనంతరం భయానక పరిస్థితులలో గడుపుతున్న తనకు.. ఫరా అండగా నిలిచిందని చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత భావోద్వేగ భరితమైనవిగా గుర్తుచేసుకుంది. ఆరోజు తాను పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉన్నానని.. ఫరా వచ్చి ధైర్యం చెప్పినప్పుడు తనకు బలం వచ్చిందని భావోద్వేగానికి గురైంది.

Also Read: Ind vs Sa 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే

ఇక సానియా మీర్జా కి విడాకులు ఇచ్చి.. మూడవ పెళ్లి చేసుకోవడంపై గత ఏడాది షోయబ్ మాలిక్ పరోక్షంగా మాట్లాడాడు. ” ప్రజల గురించి కాకుండా, మనసుకు నచ్చినట్లు నడుచుకోవాలి. మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. ప్రజలు ఏమనుకుంటారో అని ఎప్పటికీ ఆలోచించకూడదు. జనాలు అర్థం చేసుకోవడానికి పదేళ్లు లేదా 20 ఏళ్లు సమయం కూడా పడుతుంది. అప్పటివరకు మనం ఏం చేయకుండా ఆగిపోలేము కదా ” అని అన్నాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×