E-Paper
Advertisement

Shikhar Dhawan Marriage: రెండో పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌..సోఫీ షైన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Shikhar Dhawan Marriage: రెండో పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌..సోఫీ షైన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
Advertisement

Shikhar Dhawan Marriage:  శిఖర్ ధావన్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేశాడు. తన ప్రియురాలు సోఫీ షైన్‌ ను రెండో పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధావన్. ఐర్లాండ్ కు ( Ireland ) చెందిన తన ప్రేయసి సోఫీ షైన్‌ తో ( Sophie Shine) చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్న‌ శిఖర్ ధావన్.. ఇవాళ మూడు ముళ్ళు వేశాడు. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్ – సోఫీ షైన్ పెళ్లి ( Shikhar Dhawan Marriage) ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గబ్బర్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు.. ఇక లైఫ్ ఎంజాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌

Advertisement

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇవాళ రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్‌ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధావన్. దాదాపు ఏడాది కాలంగా సోఫీ షైన్ తో డేటింగ్ లో ఉన్నాడు శిఖ‌ర్‌ ధావ‌న్‌. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా, కలిసి వెళ్లేవారు. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు. దాదాపు ఏడాది కలంగా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే గత నెల రోజుల కిందట ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట… ఇవాళ పెళ్లి పీటలు ఎక్కింది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో కొద్ది మంది సమక్షంలోనే రెండో పెళ్లి చేసుకున్నారు శిఖర్ ధావన్ – సోఫీ షైన్‌. ఈ పెళ్లి ఈవెంట్ కు టీమిండియా మాజీ క్రికెటర్లు కొంత మంది హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు చాహల్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడట. హిందూ సంప్రదాయం ప్రకారమే శిఖర్ ధావన్ రెండో పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. దీంతో వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ త‌రుణంలోనే శిఖర్ ధావన్ – సోఫీ షైన్ జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌.

ధావ‌న్ భార్య‌ సోఫీ షైన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Advertisement

ఐర్లాండ్ లో పుట్టి పెరిగిన ఈమె, చదువు కూడా అక్కడే ఫినిష్ చేశారు. మార్కెటింగ్ రంగంలో డిగ్రీ పూర్తి చేశారు. ఇక అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్ లో సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి ప్రతిభ చాటుకున్నారు. ప్రస్తుతం శిఖర్ ధావన్ కు సంబంధించిన ఫౌండేషన్ ను సోఫీ షైన్ చూసుకుంటున్నారు. అలాగే శిఖర్ ధావన్ కు సంబంధించిన డా వన్ స్పోర్ట్స్ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కూడా ఆమె వర్క్ చేస్తున్నారు. కాగా 2025 మే నెలలో డేటింగ్ లో ఉన్నట్లు అధికారికంగా సోఫీ షైన్ – శిఖ‌ర్ ధావ‌న్ వెల్ల‌డించారు.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×