E-Paper
Advertisement

IPL 2026 : ఐపీఎల్‌లో షాహిన్ షా అఫ్రిదికి రూ.30 కోట్లు?

IPL 2026 : ఐపీఎల్‌లో షాహిన్ షా అఫ్రిదికి రూ.30 కోట్లు?
Advertisement

IPL 2026 : ఐపీఎల్ లో ప‌లువురు విదేశీ క్రికెట‌ర్లు అత్య‌ధిక ధ‌ర ప‌లికిన విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలోనే శ్రీలంక కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ మ‌తీషా పతిరానాకు రూ.18కోట్లు ఇచ్చి కోల్ కోతా నైట్ రైడ‌ర్స్ ద‌క్కించుకుంది. దీంతో అత‌ను ఐపీఎల్ వేలం చ‌రిత్ర‌లో అత్యంత ఖ‌రీదైన శ్రీలంక క్రికెట‌ర్ గా చ‌రిత్ర‌లో నిలిచాడు. వేలానికి ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ అత‌డిని విడుద‌ల చేసింది. పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది ప‌తిరానా పై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. మ‌తీషా ప‌తిరానాకు రూ.18 కోట్లు ఐపీఎల్ వేలంలో వ‌చ్చిన‌ప్పుడు పాకిస్తాన్ కి చెందిన షాహిన్ షా అఫ్రిది లాంటి ప్రీమియం ఫాస్ట్ బౌల‌ర్ కి ఇంకా ఎంత ప‌ల‌కాలి..? అంటే క‌చ్చితంగా రూ.30కోట్లు ప‌లుకుతాడు అంటూ కామెంట్స్ చేశాడు.

Also Read : Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

షాహిద్ అఫ్రిది కామెంట్స్ వైర‌ల్ 

Advertisement

ప్ర‌స్తుతం షాహిద్ అఫ్రిది చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వాస్త‌వానికి  మతీషా పతిరనా బేస్ ధర 2 కోట్ల రూపాయలు. అత‌ని కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరాటం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పతిరనా కోసం తమ పర్సులో సగానికి పైగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ KKR ముందు వారు నిలబడలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ 15.60 కోట్ల రూపాయలకు చేతులు ఎత్తేసింది, ఆ తర్వాత కూడా LSG కాస్త ముందుకు సాగింది. పతిరనా కోసం 17.80 కోట్ల రూపాయల వరకు బిడ్ వేసింది. కానీ ఆ తర్వాత LSG కూడా వెనక్కి తగ్గింది. చివరకు KKR పతిరనా ని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ప‌తిరానా శ్రీలంక త‌రపున ఆసియా క‌ప్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అత‌డినీ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎందుకు వ‌దులుకుందో అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

శ్రీలంక క్రికెట‌ర్ గా ప‌తిర‌నా రికార్డు

అతని కంటే ముందు వేలంలో అత్యంత ఖరీదైన శ్రీలంక ఆటగాడిగా రికార్డు వానిందు హసరంగా పేరు మీద ఉంది, RCB 2022 వేలంలో అతన్ని 10.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ మతీషా పతిరనాని రూ.13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ గత సంవత్సరం కంటే 5 కోట్ల రూపాయలు ఎక్కువ బిడ్ వేసింది. ఇంతకు ముందు KKR ఇదే వేలంలో కామెరూన్ గ్రీన్ కోసం 25.20 కోట్ల రూపాయలు బిడ్ వేసింది. మతీషా పతిరనా తన IPL కెరీర్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లలో 47 వికెట్లు తీశాడు. 2025 సీజన్ అతనికి పెద్దగా బాగా లేదు, ఇందులో అతను CSK కోసం 12 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాడు. అయితే, అంతకుముందు సీజన్‌లో అతను కేవలం 6 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీశాడు.

Advertisement

Also Read : BCCI : గిల్ ఎందుకు లేడు? క్లారిటీ ఇచ్చిన అగార్కర్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×