E-Paper
Advertisement

Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా
Advertisement

Shahid Afridi:  టీమిండియా గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు నిత్యం ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఇండియా మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అని ఆరోపణలు చేసే మాజీ క్రికెటర్లు.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా బౌలింగ్ కోచ్ బాధ్యతలను తనకు ఇవ్వాలని కోరాడు. ఒకవేళ తనకు బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఇస్తే 100 మంది బుమ్రాల‌ను తయారు చేస్తానని ప్రకటించాడు. ఆ స‌త్తా త‌న‌కు ఉంద‌న్నారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

టీమిండియా బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు ఇవ్వండి

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా వ్యవహారం ఉంటుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం పైసా వసూల్ అన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది. వ్యూయర్ షిప్ విపరీతంగా వస్తుంది. అయితే ఈ రెండు దేశాల మధ్య ఐసీసీ టోర్నమెంట్లలో తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు మాత్రం లేవు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది సంచలన ప్రకటన చేశారు. తనకు టీమిండియా బౌలింగ్ కోచ్ గా పని చేయాలని ఎంతో ఆసక్తిగా ఉందని వెల్లడించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బౌలింగ్ కోచ్ అవతారం ఎత్తుతానని తెలిపారు.

అయితే తాను బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటే టీమిండియా స్వరూపం మారిపోతుందని వివరించారు. అంతేకాదు బుమ్రా ( Bumrah) లాంటి 100 మంది బౌలర్లను ఇండియాకు తయారు చేస్తానని శపథం చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం వేపుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మాకు పగవాడు వద్దని.. పాలోడు ముద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ దగ్గర చాలా మంది మాజీ బౌలర్లు ఉన్నారు.. వాళ్లే కోచ్ లుగా వ్యవహరిస్తారని కౌంటర్ ఇస్తున్నారు. షాహిద్ ఆఫ్రీది సేవలు తమకు వద్దని కుండ‌ బద్దలు చెబుతున్నారు.

టీమిండియా బౌలింగ్ కోచ్ గా అఫ్రీదికి ఛాన్స్ ఇస్తారా ?

Advertisement

పాకిస్తాన్ కు సంబంధించిన షాహిద్ ఆఫ్రీదికి టీమిండియా బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఇవ్వడం చాలా కష్టం. రెండు దేశాల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. 2008 చివరలో ముంబై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్ ఆడకుండా పాకిస్తాన్ ప్లేయర్లపై బ్యాన్ విధించారు. దీంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి. దానికి తోడు మొన్న ఆపరేషన్ సింధూరం జరిగినప్పుడు పాకిస్తాన్ కు సపోర్ట్ గా షాహిద్ ఆఫ్రీది ర్యాలీ కూడా చేశాడు. అలాంటోడికి టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు ఇచ్చే ఛాన్సే లేదని అంటున్నారు ఫ్యాన్స్.

 

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

 

https://www.facebook.com/story.php?story_fbid=122165358008815028&id=61574450864731&rdid=86Ci41znWph214bS#

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×