E-Paper
Advertisement

BBL-Shaheen Afridi: షాహీన్ అఫ్రిదికి ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ తొలగించిన అంపైర్

BBL-Shaheen Afridi: షాహీన్ అఫ్రిదికి ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ తొలగించిన అంపైర్
Advertisement

BBL-Shaheen Afridi: పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ గా చెప్పుకునే షాహిన్ షా అఫ్రిది కి బిగ్ బాష్ లీగ్ {BBL} డెబ్యు మ్యాచ్ లో ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో అతడి బౌలింగ్ ని ఫీల్డ్ అంపైర్ రద్దు చేశాడు. ఓవర్ మధ్యలోనే అతనిపై సస్పెన్షన్ విధిస్తూ ఈ చర్యలు తీసుకున్నాడు.

Also Read: Varanasi Cricket stadium: మోదీనా మజాకా.. హిందుత్వం ఉట్టిపడేలా క్రికెట్ స్టేడియం.. గ్రౌండ్ మొత్తం ఇక శివతాండవమే

Advertisement

జీలాంగ్ వేదికగా జరిగిన మెల్ బోర్న్ రెనిగేట్స్ – బ్రిస్ బెన్ హీట్ మ్యాచ్ లో షాహిన్ అఫ్రీది ఈ ఓవర్ వేస్తుండగా అంపైర్ మధ్యలోనే ఆపి.. మరో బౌలర్ తో బౌలింగ్ చేయించాడు. దీంతో డెబ్యు మ్యాచ్ లో పాకిస్తాన్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదికి ఘోర అవమానం జరిగినట్లు అయింది. ఈ అనూహ్య సంఘటనతో షాహిన్ షా ఆఫ్రిది అవాక్కయ్యాడు.

 

ఓకే ఓవర్ లో రెండు బీమర్స్:

Advertisement

బ్రిస్ బెన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాహిన్ షా ఆఫ్రిది.. మెల్ బోర్న్ తో సోమవారం రోజు జరిగిన రెండవ మ్యాచ్ 18 ఓవర్ లో.. ఒకే ఓవర్ లో ఏకంగా రెండు బీమర్స్ వేసి సస్పెన్షన్ కి గురయ్యాడు. 18 ఓవర్ మూడవ బంతిని హై ఫుల్ టాస్ వేయగా.. ఆ బంతి హెల్మెట్ కి తాకింది. దీంతో అంపైర్ నోబాల్ ఇవ్వడంతో తొలి బీమర్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఇక నాలుగవ బంతిని మరోసారి అవుట్ సైడ్ ఆఫ్ దిశగా ఫుల్ టాస్ వేశాడు. ఈ బంతిని ఎంపైర్ వైడ్ గా ప్రకటించాడు. అనంతరం ఐదవ బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్ నోబెల్ సిగ్నల్ ఇచ్చి బౌలర్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకే ఓవర్ లో రెండు బీమర్స్ వేస్తే.. బౌలర్ ని మ్యాచ్ మొత్తం మళ్లీ బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తారు. షాహిన్ అఫ్రిది విషయంలోనూ ఈ చర్యలనే తీసుకున్నారు అంపైర్లు. అంతేకాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆఫ్రిది మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం కూడా ఉంది.

Also Read: IPL 2026: ఐపీఎల్ లో కొత్త రూల్స్‌.. డ్రామాలు చేస్తే తోక క‌ట్ చేయ‌డ‌మే, హ్యారీ బ్రూక్ పై రెండేళ్ల బ్యాన్‌

 

సోషల్ మీడియాలో ఆఫ్రిదిపై మీమ్స్:

బిగ్ బాస్ లీగ్ అరంగేట్రంలోనే సస్పెన్షన్ కి గురైన షాహిన్ షా ఆఫ్రిది పై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ పేలుతున్నాయి. పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ కి ఇలాంటి గతి పట్టిందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. బిబిఎల్ డెబ్యూ హర్రర్ షో గా మారిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక 25 ఏళ్ల ఈ ఎడమ చేతి పేసర్ తన 2.4 ఓవర్ల స్పెల్ లో 43 పరుగులు ఇచ్చి తీవ్రంగా విఫలమయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లతో పాటు రెండు సిక్స్ లు, రెండు వైడ్స్, మూడు నో బాల్స్ ఉన్నాయి. ఇక షాహిన్ విఫల ప్రదర్శన రెనిగేడ్స్ కి కలిసి వచ్చింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మేల్ బోర్న్ జట్టు 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×