E-Paper
Advertisement

Shaheen Afridi : ఇరాన్-అమెరికా యుద్ధంపై వివాద‌స్ప‌ద ట్వీట్…షాహీన్ అఫ్రిదిపై ఐసీసీ బ్యాన్ !

Shaheen Afridi : ఇరాన్-అమెరికా యుద్ధంపై వివాద‌స్ప‌ద ట్వీట్…షాహీన్ అఫ్రిదిపై ఐసీసీ బ్యాన్ !
Advertisement

Shaheen Afridi :  ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దేశం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ ను పతనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు అలాగే ఎల్పీజీ కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతమైతే ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అలాగే అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గు ముఖం పట్టడానికి కారణం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అంటూ వ్యాఖ్యానించారు షాహీన్ అఫ్రిది. దీంతో షాహీన్ అఫ్రిది చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ క్ర‌మంలో షాహీన్ అఫ్రిదిను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

Also Read: KKR VS LSG: అంతా ఫిక్సింగే..రెండు క్యాచ్ లు వివాదం, ఫిన్ అలెన్‌, ర‌హానే ఇద్ద‌రూ నాటౌటే !

షాహీన్ అఫ్రిదిపై దారుణంగా ట్రోలింగ్స్

Advertisement

ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపింది పాకిస్తాన్ అంటూ షాహీన్ అఫ్రిది చేసిన పోస్ట్ ఎప్పుడు దుమారం రేపుతోంది. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. అసలు ఇరాన్-అమెరికా యుద్ధంతో పాకిస్తాన్ కు ఎలాంటి సంబంధం లేదని.. వాళ్ల వల్ల ఉద్రిక్తతలు ఎక్కడా తగ్గలేదని కౌంటర్ ఇస్తున్నారు. అంతేకాదు ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసినందుకు షాహీన్ అఫ్రిదిపై బ్యాన్ కూడా విధించాలని కొంత మంది క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు సపోర్ట్ గా నిలిచిన నసీమ్ షాపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇప్పుడు షాహీన్ అఫ్రిదిని పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

షాహీన్ అఫ్రిది పై ఐసీసీ బ్యాన్ వేయనుందా.. రూల్స్ ఏం చెబుతున్నాయి ?

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi ) పైన ఐసీసీ బ్యాన్ విధిస్తుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఏ ఒక్క ప్లేయర్ కూడా రాజకీయ కామెంట్స్ చేయకూడదు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏది వాగినా పర్వాలేదు. కానీ ఐసీసీ టోర్నమెంట్ లో ఆడే ఏ ఒక్క క్రికెటర్ కూడా రాజకీయాలకు సంబంధించిన కామెంట్స్ చేయకూడదు. కానీ తాజాగా షాహీన్ అఫ్రిది అదే తప్పిదం చేశాడు. దీంతో షాహీన్ అఫ్రిదిపై బ్యాన్ విధించాలని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక అటు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు సపోర్ట్ గా మాట్లాడుతూ, మరియం నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి పోస్ట్ పెడితే మాత్రం నసీమ్ షాపైన‌ చర్యలు తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఫైన్ విధించింది. ఇక ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేసిన షాహీన్ అఫ్రిదిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పాకిస్తాన్ అభిమానులు. మరి దీనిపై ఐసీసీ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

Also Read: Mukul Choudhary: ల‌క్నోలో మ‌రో ధోని, హెలిక్యాప్ట‌ర్ కొట్టి కేకేఆర్ ను చిత్తు చేశాడు..ఎవ‌రీ ముకుల్ చౌదరి

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×