E-Paper
Advertisement

PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్
Advertisement

Fixing In PSL:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తరహాలోనే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ అద్భుతంగా కొనసాగుతోంది. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ లో ఊహించని పరిణామం ఎదురైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఫిక్సింగ్ ( Fixing In PSL) జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లాహోర్ ఖలందర్స్ జట్టుకు ( Lahore Qalandars) సంబంధించిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది ( shaheen afridi) అలాగే ఆల్ రౌండర్ ( Sikandar Raza) హోటల్ రూమ్ లోకి నలుగురు దుండగులు వచ్చినట్లు తెలుస్తోంది. వీళ్లు అర్ధరాత్రి పూట ఫిక్సింగ్ కు తెర లేపినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ పాకిస్తాన్ క్రికెట్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే ఫిక్సింగ్ కలకలం చోటుచేసుకుంది. లాహోర్ జట్టుకు సంబంధించిన షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా ఇద్దరు కూడా ప్రోటోకాల్ ఉల్లంఘించారని తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, PSL యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా నలుగురు వ్యక్తులను తమ హోటల్ రూమ్ లోకి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఈ నలుగురిని హోటల్ రూమ్ లో కలిసేందుకు లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రాణా, పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ దగ్గర మాట్లాడి ఈ పర్మిషన్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారట. కానీ రూల్స్ ప్రకారం వాటిని తిరస్కరించారు ఉన్నతాధికారులు.

దీంతో ఆ నలుగురు వ్యక్తులను రహస్యంగా కలిసేందుకు షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా ఇద్దరు పెద్ద ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఆ నలుగురు అజ్ఞాత వ్యక్తులను తమ రూమ్ లోకి షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా పిలిపించుకున్నార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలోనే రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకు షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా హోటల్ రూమ్ లోనే ఈ నలుగురు దుండగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఫిక్సింగ్ జరిగినట్లు చర్చ జరుగుతోంది. దీనిపై నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

షాహీన్ అఫ్రిది, సికందర్ రాజాపై రెండు సంవత్సరాల బ్యాన్ ?

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేయడం.. పర్మిషన్ లేకపోయినా నలుగురు అజ్ఞాత వ్యక్తులను అర్ధరాత్రి హోటల్ రూమ్ లోకి పిలిపించుకున్న నేపథ్యంలో షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా పైన వేటు వేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సెంట్రల్ కాంట్రాక్టు, భ‌ద్ర‌త‌ రూల్స్ ప్రకారం ఈ షాహీన్ అఫ్రిది, సికందర్ రాజాపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

 

 

 

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×