E-Paper
Advertisement

Shadab Khan: పందుల్లాగా తిని, గ‌డ్డాలు పెంచేవాళ్ల‌కు ఏం తెలుసు..పాకిస్తాన్ మాజీల ప‌రువు తీసిన‌ షాదాబ్ ఖాన్

Shadab Khan: పందుల్లాగా తిని, గ‌డ్డాలు పెంచేవాళ్ల‌కు ఏం తెలుసు..పాకిస్తాన్ మాజీల ప‌రువు తీసిన‌ షాదాబ్ ఖాన్
Advertisement

Shadab Khan: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో పాకిస్తాన్ అదరగొడుతోంది. టీమిండియా చేతిలో ఒక్క ఓటమి మినహాయిస్తే గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది పాకిస్తాన్. దీంతో సూపర్ 8 లో అడుగుపెట్టింది పాకిస్తాన్. అయితే గ్రూప్ స్టేజ్ లో టీం ఇండియా చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లను తొలగించాలని మహమ్మద్ యూసఫ్ ( Mohammad Yousuf ), షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi ) ఇలాంటి క్రికెటర్లు సీరియస్ అయ్యారు. షాహీన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, బాబర్ ఆజం లాంటి ప్లేయర్లను వెంటనే పాకిస్తాన్ జట్టులోంచి తీసివేయాలని.. రెచ్చిపోయి వ్యాఖ్యానించారు. అయితే మహమ్మద్ యూసఫ్, షాహిద్ అఫ్రిది చేసిన కామెంట్లకు తాజాగా పాకిస్తాన్ ఆల్ రౌండ‌ర్‌ షాబాద్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పందుల్లాగా తిని, గడ్డలు పెంచే మీకేం తెలుసు… ఇండియాను ఓడించిన చరిత్ర మాది అంటూ గుర్తు చేశారు పాకిస్తాన్ క్రికెటర్ షాబాద్ ఖాన్ ( Shadab Khan). దీంతో షాబాద్ ఖాన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

మీకు చేతకాలేదు.. మేము ఓడించి చూపించాం, షాబాద్ ఖాన్ కౌంటర్ అదుర్స్

Advertisement

ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లను మహమ్మద్ యూసఫ్, షాహిద్ ఆఫ్రిది లాంటి క్రికెటర్లు బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. షాహీన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, బాబర్ ఆజం లాంటి ముగ్గురు క్రికెటర్లను జట్టు లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు మహమ్మద్ యూసఫ్, షాహిద్ ఆఫ్రిది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు ఈ మాజీ క్రికెటర్లు. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్‌ స్పందించారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. రెచ్చిపోయారు. నిన్న నమీబియా పై విజయం సాధించిన పాకిస్తాన్ సూపర్ 8 లోకి అడుగుపెట్టింది.

అయితే ఈ మ్యాచ్ లో షాబాద్ ఖాన్ అద్భుతంగా రాణించి, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల నోరు మూయించాడు. తమ మాజీ క్రికెటర్లకు వాళ్ల సొంత అభిప్రాయాలు ఉంటాయని వెల్లడించారు. వాళ్లు దిగ్గజాలు కావచ్చు.. కానీ ఇండియాను ఓడించిన దాఖలాలు లేవని చురకలు అంటించారు. కానీ మేము ఇండియాను ఓడించామని గుర్తు చేశారు. వరల్డ్ కప్ సమయంలో ఇండియాను ఓడించి చూపించామని తెలిపారు. అయినప్పటికీ విమర్శలు చాలా సాధారణమని… పేర్కొన్నారు. కాగా 2021 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ( T20 World Cup 2021 tournament) సందర్భంగా టీమిండియా పై పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండ‌గా, నిన్న న‌మీబియాపైన 19 ప‌రుగులు ఇచ్చి, 3 వికెట్లు ప‌డ‌గొట్టారు షాబాద్ ఖాన్‌.

Advertisement

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×