E-Paper
Advertisement

Serena :సెరెనా రిటర్న్స్?

Serena :సెరెనా రిటర్న్స్?
Advertisement

Serena : సెరెనా విలియమ్స్ మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టబోతోంది. గత ఆగస్ట్ 9న ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన ఈ అమెరికా నల్లకలువ… తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. తాను మళ్లీ బరిలోకి దిగడం ఖాయమని సెరెనా సంకేతమిచ్చింది.

తన వ్యాపార ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సెరెనా… తాను రిటైర్ కాలేదని వ్యాఖ్యానించింది. ఆట నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని, ఇప్పటికీ తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. రీ ఎంట్రీపై ఆమె హింట్ ఇవ్వ డంతో… అంతా ఒక్కసారి షాకయ్యారు. 2022 యూఎస్‌ ఓపెన్‌ మూడో రౌండ్‌లో నిష్క్రమించిన సెరెనాకు గ్రాండ్ గా వీడ్కోలు పలికిన నిర్వాహకులు, అభిమానులు… ఆమె మాటలకు అవాక్కవుతున్నారు.

Advertisement

కెరీర్ లో ఇప్పటిదాకా 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది… సెరెనా విలియమ్స్. 41 ఏళ్ల ఈ నల్లకలువ… 2017లో తన చివరి గ్రాండ్ స్లామ్ ను గెలిచింది. అస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించింది. అదే సెంటిమెంట్ తో… వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా సెరెనా మళ్లీ టెన్నిస్ కోర్టులో ఆడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు… విశ్లేషకులు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×