E-Paper
Advertisement

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !

pak vs sa match: గ‌ల్లీ క్రికెట్ లాగా మారిన పాకిస్తాన్ మ్యాచ్‌… బంతి కోసం 30 నిమిషాలు వెతికార్రా !
Advertisement

pak vs sa match: దక్షిణాఫ్రికా – పాకిస్తాన్ మధ్య రావల్పిండి వేదికగా జరిగిన రెండవ టెస్టులో 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 72 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ సమమైంది. ఈ రెండవ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 113.4 ఓవర్లలో 333 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది.

Also Read: Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

Advertisement

అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా 119.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ జట్టు 138 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 73 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది సౌత్ ఆఫ్రికా.

మ్యాచ్ మధ్యలో హాస్యభరిత సన్నివేశం:

క్రికెట్ మ్యాచ్ లో కొన్ని కొన్ని సార్లు హాస్యాస్పదమైన సన్నివేశాలు జరుగుతుంటాయి. అలాంటిదే దక్షిణాఫ్రికా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ బంతిని బౌండరీ లైన్ కి తరలించాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ఆ బంతిని సరిగ్గా గమనించలేదు. అయితే ఆ బంతి నేరుగా వెళ్లి బౌండరీ రూఫ్ మధ్యలో చిక్కుకుంది. దీంతో సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు, మరియు బౌండరీ బయట ఉన్న సిబ్బంది ఆ బంతిని వెతకడం మొదలుపెట్టారు.

Advertisement

బౌండరీ బయట ఉన్న కవర్స్ లో వెతికారు. కానీ వారికి ఎంత వెతికినా ఆ బంతి కనిపించలేదు. కానీ ఆ బంతి స్పష్టంగా రూఫ్ వద్ద కనిపిస్తుంది. దీంతో కెమెరామెన్ నేరుగా ఆ బంతిని ఫోకస్ చేశాడు. కానీ వారికి మాత్రం ఎంత వెతికినా కాసేపు బంతి కనిపించలేదు. ఆ తరువాత బంతి దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్ కంటపడింది. దీంతో ఆ బాల్ తీసుకొని అతడు నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో వాళ్లు బంతిని వెతుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రీడాభిమానులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. చిన్నతనంలో క్రికెట్ ఆడే సమయంలో ఇలా బంతి కనిపించకుండా పోతే చాలా సార్లు వెతికేవాళ్ళమని జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

Also Read: Jemimah Rodrigues: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. జెమిమా బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంపు.. ఎన్ని కోట్లు అంటే

బంతి కనిపించకుండా పోతే:

ఒకవేళ మ్యాచ్ మధ్యలో బంతి కనిపించకుండా పోతే ఫీల్డర్.. “లాస్ట్ బాల్” అని పిలవాలి. అప్పుడు ఎంపైర్ డెడ్ బాల్ అని సంకేతం ఇస్తాడు. ఇక ఫీల్డర్లు బంతిని వెతకడం ఆపేసి.. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ సంఘటనపై ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్రికెట్ నియమావళి చట్టం 20 ప్రకారం.. బంతి దొరకకపోతే గత బంతి పరిస్థితికి సమానమైన పాత బంతిని ఎంచుకుంటారు. మొత్తానికి సౌత్ ఆఫ్రికా – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ హాస్యాస్పద సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by BODYLINE (@bodylinesportsandfitnessgyms)

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×