E-Paper
Advertisement

IND VS NZ Final: సంజు, అభిషేక్‌, ఇషాన్ ఊచ‌కోత‌..టీమిండియా భారీ స్కోర్‌, న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే

IND VS NZ Final: సంజు, అభిషేక్‌, ఇషాన్ ఊచ‌కోత‌..టీమిండియా భారీ స్కోర్‌, న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే
Advertisement

IND VS NZ Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final ) మధ్య అహ్మదాబాద్ వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad )  ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఈ నేపథ్యంలోనే భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది టీమిండియా. చాలా రోజుల తర్వాత అభిషేక్ శర్మ ఫామ్ లోకి కూడా వచ్చి, అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా మెరుపులు మెర్పించారు. ఈ త‌రుణంలోనే నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడింది టీమిండియా. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయిన టీమిండియా, 255 ప‌రుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ 20 ఓవ‌ర్ల‌లో 256 ప‌రుగులు సాధిస్తే, న్యూజిలాండ్ విజ‌యం సాధిస్తుంది. మ‌రి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను టీమిండియా బౌల‌ర్లు ఎలా క‌ట్ట‌డి చేస్తారో చూడాలి.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అభిషేక్ సరికొత్త రికార్డు

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో చాలా దారుణంగా విఫలమవుతున్న అభిషేక్ శర్మ.. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 21 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 52 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సిక్సర్లు, అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి. 247 స్ట్రైక్ గ్రేడ్ తో దుమ్ము లేపాడు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో రికార్డు సృష్టించాడు. ఫాస్టెస్ట్ అర్థ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు అభిషేక్ శర్మ. అంతకుముందు ఫిన్ అలెన్ 19 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అతని రికార్డు బద్దలు కొట్టాడు అభిషేక్ శర్మ.

మూడోసారి సెంచరీ మిస్ చేసుకున్న సంజు శాంసన్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సంజు శాంసన్ వరుసగా మూడోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. సూపర్ 8 దశలో వెస్టిండీస్ పై 97 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిన సంజు శాంసన్, సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ పైన 89 పరుగులు చేశాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సంజు శాంసన్ ( Sanju Samson). దీంతో ఈ వరల్డ్ కప్ లో మూడుసార్లు సెంచరీ మిస్ చేసుకున్న ప్లేయర్ గా నిలిచాడు.

Advertisement

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×