E-Paper
Advertisement

Sanjay Dutt: క్రికెట్ వరల్డ్‌లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంట్రీ..

Sanjay Dutt: క్రికెట్ వరల్డ్‌లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎంట్రీ..
Advertisement

Sanjay Dutt: ఒక రంగంలో డబ్బు, ఫేమ్.. అన్నీ సంపాదించుకున్న తర్వాత మరికొన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లాంటి వాటిలో పెట్టుబడి పెడితే.. తమకు వచ్చిన డబ్బులు డబుల్ అవుతాయని కొందరు ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం కొన్ని క్రికెట్ ఫార్మాట్స్ కూడా బిజినెస్ లాగా మారిపోయాయి. అందుకే సినీ తారలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ సీనియర్ హీరో కూడా ఈ లిస్ట్‌లో చేరాడు.

ఇప్పటికే షారూఖ్ ఖాన్, ప్రీతి జింటా.. ఇలా మరెందరో తారలు క్రికెట్ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టారు. వారు పెట్టిన భారీ పెట్టుబడులకు తగినట్టుగానే.. లాభాలు కూడా పొందుతున్నారు. ఫ్రాంచైజ్‌లతో లాభాలు వస్తుండడంతో క్రికెట్ బోర్డ్స్ కూడా లీగ్ మ్యాచ్‌లను పెంచుతూ వస్తున్నారు. టీ10, టీ20 లాంటివి ఎక్కువయిపోయాయి. త్వరలోనే జింబాబ్వే కూడా టీ20 లీగ్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ‘జిమ్ ఆఫ్రో టీ10’ పేరుతో లీగ్ మ్యాచ్‌లను ప్రారంభించనుంది.

Advertisement

జులై 20 నుండి జులై 29 వరకు జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ జరగనుంది. ఇందులో పోటీపడడానికి హరారే హరికేన్స్, డర్బన్ క్వాలందర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్ టీమ్స్ సిద్ధమయ్యాయి. అయితే ఈ కొత్త లీగ్‌తో క్రికెట్ బిజినెస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడట బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ఇప్పటికే హరారే హరికేన్స్ టీమ్ ఫ్రాంచైజీని తన సొంతం చేసుకున్నాడు సంజయ్. ఈ విషయం గురించి తానే స్వయంగా ప్రకటించాడు.

క్రికెట్ ఆడే అతిపెద్ద దేశాలలో ఇండియా కూడా ఒకటి అంటూ సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇండియాలాగానే ఈ క్రికెట్‌ను ప్రపంచంలోని ప్రతీమూలకు తీసుకెళ్లడాన్ని తను కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నాడు. ఇప్పుడు క్రికెట్‌తో ఒక అనుబంధం ఏర్పరచుకొని ప్రేక్షకులను ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. జిమ్ ఆఫ్రో టీ10లో తన టీమ్ హరారే హరికేన్స్ బాగా ఆడుతుందని భావిస్తున్నా అని తెలిపాడు సంజయ్ దత్.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×