E-Paper
Advertisement

Sania Mirza : సానియా-షోయబ్ బ్రేక్‌అప్.. ఈసారి పక్కా డైవర్స్!

Sania Mirza : సానియా-షోయబ్ బ్రేక్‌అప్.. ఈసారి పక్కా డైవర్స్!
Advertisement

Sania Mirza : సెలబ్రిటీ కపుల్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ వీడిపోతున్నారంటూ మరోసారి ప్రచారం ప్రారంభమైంది. గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరిగినా ఈ వార్తలను ఈ జంట కొట్టిపారేసింది. అయితే ఈ సారి షోయబ్ తన ఇన్‌స్టా గ్రామ్‌ బయోలో కీలక మార్పులు చేసింది. గతంలో తన బయోలో అథ్లెట్, హస్బెండ్ టు సూపర్‌ ఉమన్, ఫాదర్‌ టు వన్ ట్రూ బ్లెస్సింగ్‌ అని ఉన్న బయోను ఇప్పుడు తగ్గించేశారు. అందులో నుంచి హస్బెండ్‌ టు సూపర్ ఉమన్ అనే పదాన్ని తీసేశారు. దీంతో వీరి డైవర్స్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

Advertisement

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. 2018లో ఈ జోడికి ఓ కొడుకు జన్మించాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నట్టు పాక్‌ మీడియా కోడై కూసింది. మాలిక్‌కు బైబై చెప్పేందుకు సానియా రెడీగా ఉందన్న టాక్ కూడా వినిపించింది. అక్కడితో ఆగలేదు ఈ ప్రచారం.. ఈ స్టార్‌ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్‌ మీడియా ప్రచారం చేసింది.

పాకిస్తానీ యాక్టర్ అయేషా ఉమర్‌తో మాలిక్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడన్న ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చింది. అయితే అదే సమయంలో సానియా,షోయబ్‌ల కొత్త టాక్ షో ది మీర్జా మాలిక్ షో రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది.

Advertisement

అయితే ప్రస్తుతం షోయబ్ వైఫ్‌కి సంబంధించిన లైన్‌ను తొలగించడంతో ఈసారి డైవర్స్ పక్కా అంటూ మళ్లీ కొత్త ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈద్ పండుగ వేళ కూడా ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం, ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సానియా ఫేర్ వెల్ మ్యాచ్ కు మాలిక్ హాజరుకాకపోవడం వంటి అంశాలు కూడా వీరి విడాకుల రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా సానియా కానీ.. షోయబ్ కానీ స్పందించలేదు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×