E-Paper
Advertisement

Sania Mirza: 210 కోట్ల దుబాయ్ విల్లా.. మాలిక్ పేరు తొలగింపు, కొడుకు కోసం సానియా సంచలన నిర్ణయం

Sania Mirza: 210 కోట్ల దుబాయ్ విల్లా.. మాలిక్ పేరు తొలగింపు, కొడుకు కోసం సానియా సంచలన నిర్ణయం
Advertisement

Sania Mirza: సమాజంలో పిల్లలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగానే ఉంటుంది. అసలు పిల్లల్ని ఎలా చూసుకోవాలి..? ఎలా పెంచాలి..? అంటూ ఒక్కోసారి బాగా ఒత్తిడికి గురవుతుంటారు. సెలబ్రిటీలకు పిల్లల పెంపకం మరింత సవాల్ లాంటిది. పాపరాజ్జీలు, ప్రజల చూపులు, విజయవంతమైన తల్లిదండ్రుల పిల్లలపై పెట్టే అంచనాలు ఇలాంటివి వారికి ఒత్తిడిని కలిగిస్తాయి.

Also Read: Gambhir: అది ఛేజ్ చేయగలిగే టార్గెటే.. మావోళ్లు స‌రిగ్గా ఆడ‌లేదు

Advertisement

ఈ విషయాన్ని మాజీ టెన్నిస్ ఛాంపియన్ సానియా మీర్జా బాగా అర్థం చేసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ – సానియా మీర్జా కి ఓ కుమారుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అతడి పేరు ఇజ్ఞాన్ మీర్జా మాలిక్. ప్రస్తుతం అతడి వయసు 7 ఏళ్ళు. అయితే షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమె ఒంటరి తల్లిగా తన కుమారుడు ఇజ్జాన్ ని పెంచుతుంది.

సానియా మీర్జా సంచలన నిర్ణయం:

సానియా మీర్జా ఇటీవల తీసుకున్న ఓ వ్యక్తిగత నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఆమెకు ఉన్న విల్లా ఇప్పటివరకు ఆమె భర్త సోహెబ్ మాలిక్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అయితే ఇప్పుడు సానియా మీర్జా ఆ ప్రాపర్టీని పై మాలిక్ పేరును పూర్తిగా తొలగించినట్లు సమీప వర్గాలు వెల్లడిస్తున్నాయి. తన కొడుకు భవిష్యత్తు కోసం సానియా మీర్జా ఈ నిర్ణయం తీసుకుందట. ఆ ప్రాపర్టీని తన కుమారుడి పేరు పైకి మార్చింది సానియా. తన కొడుకు భవిష్యత్తు భద్రత, లీగల్ సెక్యూరిటీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

కుటుంబ పరిస్థితులలో ఇటీవల వచ్చిన మార్పుల నేపథ్యంలో తన ఆస్తులలో కొన్నింటిని కుమారుడి పేరు పైకి మార్చాలని ఆమె నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సానియా మీర్జా మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆమె సమీప వర్గాలు మాత్రం సానియా తీసుకునే ప్రతి నిర్ణయం తన కొడుకు ఇజ్జాన్ భవిష్యత్తు కోసమేనని తెలియజేస్తున్నాయి. ఈ విల్లా ఖరీదు దాదాపు 210 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. సింగిల్ మదర్ గా సానియా మీర్జా తీసుకున్న నిర్ణయం, స్ట్రాంగ్ స్టెప్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు.

Also Read: Ind vs pak: పాక్ చేతిలో ఇండియా ఓటమి.. వివాదంగా మారిన క్యాచ్.. ఔటా? నాటౌటా?

టెన్నిస్ లో నం. 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ మహిళ:

సానియా మీర్జా 1986 నవంబర్ 15న ముంబైలో జన్మించింది. ఆ తర్వాత ఈమె కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. టెన్నిస్ లో వరల్డ్ నెంబర్ 1 రాంక్ {డబుల్స్ కేటగిరీ} లో సాధించిన ఏకైక భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. తన కెరీర్ మొత్తంలో సానియా ఆరు ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని గెలుచుకుంది. ఇందులో మూడు మహిళల డబుల్స్, మూడు మిక్స్డ్ డబుల్స్ ఉన్నాయి. ఇక దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2015తో పాటు అర్జున అవార్డు 2004, పద్మశ్రీ 2006, పద్మ భూషణ్ 2016 వంటి పౌర పురస్కారాలను కూడా అందుకుంది.

 

 

View this post on Instagram

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×