E-Paper
Advertisement

MICT vs DSG: SA 20 సీజన్ 4 షురూ.. ఈ మ్యాచ్ లు ఉచితంగా ఎక్కడ చూడాలంటే

MICT vs DSG: SA 20 సీజన్ 4 షురూ.. ఈ మ్యాచ్ లు ఉచితంగా ఎక్కడ చూడాలంటే
Advertisement

MICT vs DSG: ప్రపంచమంతా విస్తరించిన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ సందడి నేటినుండి సౌత్ ఆఫ్రికాలో మొదలుకానుంది. మూడు సీజన్లుగా క్రీడాభిమానులను ఎంతగానో అలరిస్తున్న SA-20 నాలుగవ ఎడిషన్ నేటినుండి ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ తరహాలో క్రేజ్ సంపాదించుకున్న SA-20 లో టైటిల్ కోసం 6 జట్లు పోటీ పడనున్నాయి. దాదాపు నెల రోజులపాటు ఉత్కంఠ పోరాటాలతో కొనసాగే ఈ టోర్నీలో విజేత ఎవరో 2026 జనవరి 25న జరిగే ఫైనల్ తో తేలిపోనుంది. ఈ టోర్నీలోని తొలి పోరు డిఫెండింగ్ ఛాంపియన్ ఎం.ఐ కేప్ టౌన్ – డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది.

Also Read: Eng – Aus 4th Test: చెలరేగిన బౌలర్లు.. ఒక్కరోజే 20 వికెట్లు డౌన్

Advertisement

 

MI కేప్ టౌన్ – డర్బన్ సూపర్ జెయింట్స్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:

డిఫెండింగ్ ఛాంపియన్ ఎం.ఐ కేప్ టౌన్ తమ SA-20 2025 – 26 క్యాంపెయిన్ ని డర్బన్ సూపర్ జెయింట్స్ తో జరిగే కీలక మ్యాచ్ తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ న్యూలాండ్స్ లోని కేప్ టౌన్ వేదికగా జరగనుంది. గత సీజన్ లో ఈ వేదికపై ఎంఐ కేప్ టౌన్ అజేయంగా నిలిచి.. చివరకు టైటిల్ ని కైవసం చేసుకుంది. గత సీజన్ లో జట్టు విజయంలో కగిసో రబడా, రయాన్ రికెల్టన్, కార్బిన్ బోష్, ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. ఇక ఈ సీజన్ కి తాజాగా జట్టులో చేరిన నికోలాస్ పూరన్ బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేశాడు. మరోవైపు డర్బన్ సూపర్ జెయింట్స్ కూడా స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టుగా బరిలోకి దిగుతుంది. ఏడెన్ మార్క్రమ్ {కెప్టెన్} SA-20 లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. అలాగే జోష్ బట్లర్, క్లాసెన్, కేన్ విలియమ్ సన్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. MI కేప్ టౌన్ – డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య శుక్రవారం రోజు భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు కేప్ టౌన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ని జియో హాట్ స్టార్ యాప్ లో వీక్షించవచ్చు. ఇక స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానల్ ద్వారా టీవీలో వీక్షించవచ్చు.

Advertisement

Also Read: Vijay hazare trophy: రింకూ సింగ్ అద్భుత సెంచరీ.. సెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేసినట్టేనా?

 

జట్లు:

డర్బన్ సూపర్ జెయింట్స్ స్క్వాడ్:

డెవన్ కాన్వే, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, ఏడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హైన్‌రిచ్ క్లాసెన్, డేవిడ్ వైజ్, డయాన్ గాలియెమ్, సునీల్ నరైన్, జెరాల్డ్ కోట్జీ, నూర్ అహ్మద్, క్వెనా మఫాకా, డేవిడ్ బెడ్డింగ్‌హామ్, మార్క్వెస్ అకర్మన్, గైస్‌బర్ట్ వేగే, ఎవాన్ జోన్స్, అండిల్ సిమెలానే, ఈతాన్ బోష్, టోనీ డి జోర్జీ, డారిన్ డుపావిల్లోన్, తైజుల్ ఇస్లాం.

 

MI కేప్‌టౌన్ స్క్వాడ్:

రీఝా హెండ్రిక్స్, రస్సీ వాన్ డర్ డస్సెన్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), జేసన్ స్మిత్, రయాన్ రికెల్టన్, జార్జ్ లిండే, రషీద్ ఖాన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడా, డేన్ పీడ్, ట్రిస్టన్ లూస్, డ్వైన్ ప్రెటోరియస్, కార్బిన్ బోష్, టామ్ మూర్స్, కరీమ్ జనత్, థామస్ కాబర్, జాక్స్ స్నైమన్, టియన్ వాన్ వూరెన్, డేనియల్ లాటెగన్.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×