E-Paper
Advertisement

SA T20 League 2026 : రికెల్ట‌న్ సెంచ‌రీ వృథా.. డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ బోణీ..!

SA T20 League 2026 :  రికెల్ట‌న్ సెంచ‌రీ వృథా..  డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ బోణీ..!
Advertisement

SA T20 League 2026 :   సౌతాఫ్రికా టీ 20 లీగ్ 2025-26 సీజ‌న్ కు తెర లేచింది. కేప్ టౌన్ వేదిక‌గా డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ వ‌ర్సెస్ ఎంఐ కేప్ టౌన్ మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన సూప‌ర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెన‌ర్ల‌లో డెవాన్ కాన్వే మెరుపు అర్ధ సెంచ‌రీ చేశాడు. 33 బంతుల్లో 64 ప‌రుగులు సాధించాడు. కేన్ విలియ‌మ్స‌న్ 25 బంతుల్లో 40 ప‌రుగులు కొట్టాడు. ఇక వ‌న్ డౌన్ లో వ‌చ్చిన జోస్ బ‌ట్ల‌ర్ 12 బంతుల్లో 22, వికెట్ హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లో 22, ఆక‌ట్టుకున్నారు. అయితే కెప్టెన్ మార్క్ర‌మ్ 17 బంతుల్లో 35 ప‌రుగులు, ఇవాన్ జోన్స్ 14 బంతుల్లో 33 నాటౌట్ గా నిలిచాడు. చివ‌ర్లో డేవిడ్ వీస్ 5 బంతుల్లో 9 మెరుపులు మెరిపించాడు. దీని ఫ‌లితంగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ 5 వికెట్ల న‌ష్టానికి 232 ప‌రుగులు చేసింది.

కేప్ టౌన్ బౌల‌ర్ల‌లో జార్జ్ లిండే రెండు వికెట్లు తీయ‌గా.. కార్బిన్ బాష్, ట్రిస్ట‌న్ లూస్, ట్రెండ్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీశారు. భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో కేప్ టౌన్ ఆదిలోనే ఓపెన‌ర్ రాసీ వాన్ డెర్ డ‌సెన్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ విధ్వంస‌క‌ర శ‌త‌కంతో ఆకట్టుకున్నాడు. కేవ‌లం 63 బంతుల్లోనే 11 సిక్స‌ర్లు, 5 ఫోర్ల‌తో 113 ప‌రుగులు బాదాడు. మిగ‌తా వారిలో రీ జా హెండ్రిక్ 28 కాస్త ప‌ర్వాలేద‌నిపించాడు. జేస‌న్ స్మిత్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మెరిశాడు. మిగిలిన వారి నుంచి అత‌నికి స‌హ‌కారం ల‌భించ‌లేదు. నికోల‌స్ పూర‌న్ 15 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం.. డ్వేన్ ప్రిటోరియ‌స్ తేలిపోయాడు. కెప్టెన్ ర‌షీద్ ఖాన్ 1, కార్బిన్ బాష్ 4 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచారు.
జార్జ్ లిండే డ‌కౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 217 ప‌రుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు.

Advertisement

డేవిడ్ వీస్, సైమ‌న్ హ‌ర్మ‌ర్, క్వెనా మ‌ఫాకా, త‌లో వికెట్ తీసుకున్నారు. ఎథాన్ బాష్ నాలుగు వికెట్ల‌తో చెల‌రేగి కేప్ టౌన్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ ప‌తనాన్ని శాసించాడు. దీంతో సౌతాఫ్రికా టీ 20 లీగ్ లో తొలి శ‌త‌కం సాధించిన రికెల్ట‌న్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×