E-Paper
Advertisement

Sreesanth : క్రికెటర్ శ్రీశాంత్ పై చీటింగ్ కేసు.. ఎందుకంటే..?

Sreesanth :  క్రికెటర్ శ్రీశాంత్ పై చీటింగ్ కేసు.. ఎందుకంటే..?
Advertisement

Sreesanth : నిత్యం వివాదాల్లో ఉండే… భారత్ క్రికెటర్ శ్రీశాంత్ మరో కేసులో చిక్కుకున్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ తోపాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ భాగస్వామిగా స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి 2019 ఏప్రిల్ 25 నుంచి అనేక సార్లు నిందితులు రాజీవ్ కుమార్, వెంకటేష్ కిని రూ. 18.70 లక్షలు తీసుకున్నారని చూండా ప్రాంతానికి చెందిన ఫిర్యాదుదారు సరిష్ గోపాలన్ ఆరోపించారు. ఈ అకాడమీలో భాగస్వామి అయ్యే అవకాశం రావడంతో ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Advertisement

బాధితుడి ఫిర్యాదుతో శ్రీశాంత్‌తోపాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద అభియోగాలు మోపారు కేరళ పోలీసులు. ఈ కేసులో శ్రీశాంత్ ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×