E-Paper
Advertisement

CSK VS RCB: కోహ్లీ చెత్త ఫీల్డింగ్…CSK చేసిన తప్పిదం ఇదే.. RCB రియల్ హీరో యశ్ దయాల్

CSK VS RCB: కోహ్లీ చెత్త ఫీల్డింగ్…CSK చేసిన తప్పిదం ఇదే.. RCB రియల్ హీరో యశ్ దయాల్
Advertisement

CSK VS RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… శనివారం జరిగిన మ్యాచ్… నరాలు తెగేలా చివరి వరకు కొనసాగింది. అయితే భారీ స్కోర్ చేదించే క్రమంలో.. అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివర్లో చేతులెత్తేసింది. దీంతో గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పై రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ధోని టీం. అటు అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి… చేరుకుంది. ఈ మ్యాచ్ లో బెంగుళూరు 213 పరుగులు చేయగా చెన్నై 211 పరుగులు చేసింది.

RCB రియల్ హీరోగా యశ్ దయాల్

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రియల్ హీరోగా యష్ దయాల్ మరోసారి నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసి… జట్టును కాపాడాడు యశ్ దయాల్. చివరి ఓవర్లో మహేంద్రసింగ్ ధోని లాంటి డేంజర్ ఆటగాన్ని పెవిలియన్ పంపాడు  దయాల్. దీంతో.. ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరిగింది. ధోని అవుట్ కావడంతో చివరి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే రంగంలోకి దిగాడు. శివం దూబే వచ్చి సిక్స్ కొట్టాడు. సిక్స్ కొట్టిన బంతిని నో బాల్ గా అంపైర్ ప్రకటించాడు. అయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాల్ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వేసిన బంతులను… సిక్స్ అలాగే బౌండరీ రాకుండా కట్టడి చేశాడు. ఈ దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే యశ్ దయాల్ రియల్ హీరోగా మారాడు.

చెన్నై సూపర్ కింగ్స్ చేసిన తప్పుదం ఇదే

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన ఆయుష్ అద్భుతంగా ఆడాడు. అయితే అతని వికెట్ పడిన తర్వాత.. రంగంలోకి బ్రేవీస్ దిగాడు. అయితే అతను ఫస్ట్ బంతికే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లుంగీ ఎంగిడి వేసిన బంతికి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. వాస్తవానికి అది అవుట్ కాదు. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ బ్యాటింగ్ చేస్తున్న జడేజా అలాగే బ్రేవిస్… ఇద్దరూ డీఆర్ఎస్ తీసుకోకుండా.. టైం వేస్ట్ చేసింది. టైం అయిపోయిన తర్వాత తమకు DRS కావాలని చెన్నై బ్యాటర్లు కోరారు. కానీ టైం ముగిసిన నేపథ్యంలో బ్రేవిస్ వెను తిరగాల్సి వచ్చింది. దీంతో ఖాతా ఓపెన్ చేయకుండానే అవుట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ రిప్లై లో చూస్తే అది నాటౌట్ గా తేలింది. అతడు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ చెన్నై గెలిచేది.

క్యాచ్ మిస్ చేసిన విరాట్ కోహ్లీ

అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజా..ఈ మ్యాచ్ లో 45 బంతులో 77 పరుగులు చేశాడు. అయితే అలాంటి రవీంద్ర జడేజా క్యాచ్ ను నేలపాలు చేశాడు విరాట్ కోహ్లీ. చేతులకు వచ్చిన బంతిని జార విడిచాడు. దీంతో విరాట్ కోహ్లీ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్. కోహ్లీ చెత్త ఫీల్డర్ అని పోస్టులు కూడా పెడుతున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×