// // T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ -->
E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌
Advertisement

T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఆడే టీమిండియా జట్టు జెర్సీని తాజాగా రివీల్ చేసింది బీసీసీఐ. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఈ కొత్త జెర్సీని లాంచ్ చేయించారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు రోహిత్ శర్మ ( ROHIT SHARMA) బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియా జెర్సీని రోహిత్ శ‌ర్మ‌ చేతుల మీదుగా విడుదల చేయించింది బీసీసీఐ. అటు ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ కూడా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండవ వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సందర్భంగా ఈ జెర్సీ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక టీమిండియా జెర్సీకి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిల‌క్‌

Advertisement

టి20 వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ 2026 వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. మొత్తం 20 జట్లు 55 నేచురల్ లో తలపడనున్నాయి. టీమిండియా, అటు శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా భారత జట్టు జెర్సీని రోహిత్ శర్మతో పాటు తిలక్ వర్మ లాంచ్ చేశారు. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఎప్పటిలాగే టీమిండియా జెర్సీ బ్లూ రంగులో కనిపిస్తోంది. కాస్త కాషాయం రంగు కూడా ఈ జెర్సీలో ఉంది. అటు ఈ టోర్నమెంట్ కు అపోలో టైర్స్ స్పాన్సర్లుగా ఉంటాయి.

మొత్తం నాలుగు గ్రూపులుగా డివైడ్

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో 20 జట్టు తలపడనున్నాయి. దీంతో నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ లో టీమిండియా, పాకిస్తాన్, యుఎస్ఏ , నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ కూడా జరగనుంది. ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కొలంబో వేదిక‌గా జ‌రుగ‌నుంది. అటు గ్రూప్ బీ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ జట్లు ఉంటాయి. గ్రూప్ సీ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇటలీ, నేపాల్ ఉంటాయి. గ్రూప్-డిలో న్యూజిలాండ్‌, సౌత్ ఆఫ్రికా, ఆఫ్గనిస్తాన్, కెనడా, యూఏఈ జ‌ట్లు ఉన్నాయి.

Advertisement

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×