E-Paper
Advertisement

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది

Rohit Sharma: ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ…ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..అస‌లు ఏమైంది
Advertisement

Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ తాజాగా ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఆయన నిన్ను అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలాబెన్ అనే ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అడ్మిట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే హాస్పిటల్ లోపలికి రోహిత్ శర్మ వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ముంబైలోని ఆసుపత్రికి రోహిత్ శర్మ వెళ్లినట్లు చెబుతున్నారు.

Also Read: Asia Cup 2025 : ఆసియా కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన డేంజర్ ప్లేయర్లు వీళ్లే.. లిస్టులో మనోళ్లే అంతా

టెన్షన్ లో రోహిత్ శర్మ అభిమానులు… అస్పత్రికి హిట్ మాన్

Advertisement

టీం ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన తొడ కండరాలు పట్టేశాయని… దీంతో నొప్పి విపరీతంగా ఉందని రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలోనే…. భారీగా బరువు తగ్గి… ఫిట్ గా మారారు. యో యో అలాగే బ్రాంకో టెస్ట్ నేపథ్యంలో…. రోహిత్ శర్మ దాదాపు 24 కిలోలు తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన తొడ కండరాలు పట్టేసాయట. అయితే ఆ గాయం నుంచి కోలుకునేందుకు తాజాగా ముంబైలోని ప్రముఖ కోకిలబెన్ కు వెళ్లినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియోలో చాలా సింపుల్గా రోహిత్ శర్మ కనిపించారు. తన సెక్యూరిటీ లేదా కుటుంబ సభ్యులు లేకుండానే ఆసుపత్రికి సైలెంట్ గా వచ్చారు రోహిత్ శర్మ. సాధారణ స్లిప్పర్స్ ధరించి… మెల్లిగా నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లారు రోహిత్ శర్మ. దీన్నిబట్టి చూస్తే నిజంగానే రోహిత్ శర్మకు… హెల్త్ ఇష్యూ ఉందని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

20 రోజుల్లో 24 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ ( Rohit Sharma)

Advertisement

భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా తీసుకువచ్చిన పరీక్షలు నేపథ్యంలో… టీమిండియా వన్డే కెప్టెన్ రో హి త్ శర్మ భారీగా బరువు తగ్గారు. కేవలం 20 రోజుల్లోనే 24 కిలోలు తగ్గారు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు ఈమధ్య కాలంలోనే వైరల్ అయిన సంగతి తెలిసిందే.  బ్రాంకో, యోయో టెస్టుల నేప‌థ్యంలోనే… రోహిత్ శ‌ర్మ బ‌రువు త‌గ్గాల్సి వ‌చ్చింది. ఈ టెస్టుల‌ను విజ‌య‌వంతంగా కూడా ఫినిష్ చేశాడు హిట్ మెన్ రోహిత్ శ‌ర్మ‌. అటు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ‌ధ్య త్వ‌ర‌లోనే… వ‌న్డే సిరీస్ జ‌రుగ‌నుంది. ఆ స‌మ‌యంలోనే… టీమిండియాలోకి రానున్నారు రోహిత్ శ‌ర్మ‌.

 

Also Read: Hafthor Bjornsson 510 kg: వీడు మ‌నిషి కాదు..మృగ‌మే…ఏకంగా 510 కేజీలు ఎత్తి స‌రికొత్త చ‌రిత్ర‌

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×