E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?
Advertisement

Rohit Sharma Century With Shardul Bat:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 3rd ODI) మధ్య లార్డ్స్ (Lord’s, London) వేదికగా జరిగిన మూడవ వన్డే కూడా ఫినిష్ అయింది. ఇందులో చిత్తుగా ఓడిన టీమిండియా, వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. కానీ ఇదే మ్యాచ్ లో రోహిత్ శర్మ ( Rohit Sharma) సెంచరీ చేయడం అభిమానులకు భారీ ఊరటను కలిగించింది. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా ఆదివారం మూడవ వన్డే జరిగింది. ఇందులో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించి సెంచరీ నమోదు చేసుకున్నాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. దీంతో రిటైర్మెంట్ వార్తలకు బ్రేక్ పడింది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

శార్దూల్ ఠాకూర్ బ్యాట్ తో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాట్ పైన శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) అని రాసి ఉంది. దీంతో సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. అసలు రోహిత్ శర్మ… బౌలర్ శార్దుల్ ఠాకూర్ బ్యాట్ ఎందుకు వాడుతున్నాడు ? ఆ బ్యాట్ వాడడం వల్ల రోహిత్ శర్మకు కలిసి వచ్చిందా ? అందుకే లార్డ్స్ లో సెంచరీ చేశాడా ? అంటూ రకరకాల ప్రశ్నలతో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు శార్దూల్ బ్యాట్ ను రోహిత్ శర్మ ఎందుకు పట్టాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కూడా సెర్చ్ చేస్తున్నారు.

శార్దుల్ బ్యాట్ ను రోహిత్ శర్మ పట్టడం వెనుక కారణం ఇదే

లార్డ్స్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ప్రచారం చేయగా, రోహిత్ శర్మ మాత్రం సెంచరీ చేసి చూపించాడు. దీంతో ట్రోలింగ్ చేసిన వాళ్లకు సమాధానం చెప్పాడు. అయితే ఈ సందర్భంగా రోహిత్ శర్మ వాడిన బ్యాట్ వైరల్ గా మారింది. గతంలో శార్దుల్ ఠాకూర్ వాడిన బ్యాట్ ను చూసి ముచ్చ‌ట‌ప‌డ్డాడు రోహిత్ శర్మ. శార్దుల్ ఠాకూర్ వాడుతున్న బ్యాట్లను చూసిన రోహిత్ శర్మ రెండిటినీ తీసుకున్నాడట. అంతకుముందే ఆ బ్యాట్ల‌పై శార్దూల్ ఠాకూర్ తన పేరును ఇంగ్లీషులో లిఖించాడు.

Advertisement

అయినప్పటికీ రోహిత్ శర్మ పెద్ద మనసు చేసుకొని..అత‌ని పేరు ఉన్న‌ప్ప‌టికీ శార్దూల్ నుంచి రెండు బాట్లను తీసుకెళ్లాడు. లార్డ్స్ వేదికగా ఇందులో ఒక దాన్ని ఉపయోగించి సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే శార్దుల్ పేరుతో పాటు ఆ బ్యాట్ వైరల్ గా మారింది. అంతేకానీ అతని బ్యాట్ వాడితే లక్ కలిసి వస్తుందని రోహిత్ శర్మ వాడలేదు. శార్దూల్ వాడే బ్యాట్, కాస్త లైట్ వెయిట్ ఉంటుంద‌ట‌. ప‌ట్టుకోవ‌డానికి సుల‌భంగా ఉంద‌ని స‌మాచారం. ఇది తెలియక చాలా మంది రకరకాల వార్తలు వైరల్ చేస్తున్నారు. 2023లో కూడా ఇలాగే శార్దూల్ ఠాకూర్ బ్యాట్ వాడినట్లు తెలుస్తోంది.

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×