E-Paper
Advertisement

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఫ్యామిలీతో చిల్ అవుతున్న అల్లు హీరో..పెళ్లికి పిలుస్తున్నాడా ఏంటి?

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ ఫ్యామిలీతో చిల్ అవుతున్న అల్లు హీరో..పెళ్లికి పిలుస్తున్నాడా ఏంటి?
Advertisement

Rohit Sharma:  టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ( Rohit Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 లతోపాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మొన్న దక్షిణాఫ్రికా పైన దుమ్ము లేపిన రోహిత్ శర్మ, టీమిండియాకు సిరీస్ రావడంలో తన వంతు కృషి చేశాడు. అయితే, అలాంటి రోహిత్ శర్మ, రితిక సజ్దేతో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

రోహిత్ శర్మ ఫ్యామిలీతో అల్లు శిరీష్ సందడి

Advertisement

టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యామిలీతో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ సందడి చేశారు. ఈ సందర్భంగా డిన్నర్ చేసినట్లుగానే ఒకే టేబుల్ పైన రోహిత్ శర్మ, ఆయన భార్య రితిక సజ్దే శర్మ అలాగే అల్లు శిరీష్ మెరిశారు. ఈ సందర్భంగా వాళ్ళ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అయితే ఈ ముగ్గురు కలవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ( Axis Max Life ) యాడ్ షూట్ లో భాగంగా ఈ ముగ్గురు కలిశారు. యాక్సిస్ బ్యాంకు కు సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్టును ఈ సందర్భంగా ప్రమోట్ చేశారు.

ఈ ప్రమోషన్ వీడియోలో షూటింగ్ గురించి అల్లు శిరీష్‌ ( Allu Sirish ) మాట్లాడుతుంటే, ఫుల్ షాట్ ఆడతనంటూ రోహిత్ శర్మ సందడి చేస్తూ ఉంటాడు. అటు వీళ్ళిద్దరి డైలాగ్ల మధ్య రితిక సజ్దే ( Ritika Sajdeh) నోరు తెరిచి చూస్తూ ఉంటారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు, సినిమా ప్రియులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కుటుంబంతో అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వాళ్లు చుట్టాలు అవుతారని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే తన పెళ్లి కాబట్టి రోహిత్ శర్మ కుటుంబాన్ని అల్లు శిరీష్ కలిసినట్లు మరి కొంతమంది సెటైర్లు పేలుచుతున్నారు.

త్వరలోనే అల్లు శిరీష్ ( Allu Sirish ) పెళ్లి

Advertisement

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష ( Allu Sirish ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. ఇందులో భాగంగానే అక్టోబర్ 31వ తేదీన అల్లు శిరీష్ అలాగే నయ‌నిక‌ ( Nayanika) ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అల్లు రామలింగయ్య జయంతి రోజునే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగడం గమనార్హం. ఇంకా ఇద్దరు వివాహం ఫిబ్రవరి ప్రారంభంలో జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×