E-Paper
Advertisement

Rohit Sharma-vada pav: వ‌డ‌పావ్ ఆఫ‌ర్ చేసిన ఫ్యాన్స్.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ అదుర్స్‌

Rohit Sharma-vada pav: వ‌డ‌పావ్ ఆఫ‌ర్ చేసిన ఫ్యాన్స్.. రోహిత్ శ‌ర్మ రియాక్ష‌న్ అదుర్స్‌
Advertisement

Rohit Sharma-vada pav: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ( Rohit Sharma) వ‌డ‌పావ్ ( Vada pav) అంటే బాగా ఇష్టమన్న‌ సంగతి తెలిసిందే. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టులో దూకుడుగా ఆడేందుకుగాను తనకు ఇష్టమైన వ‌డ‌పావ్ పూర్తిగా మానేశాడు రోహిత్ శర్మ. వ‌డ‌పావ్ మానేయడమే కాకుండా 20 కేజీల వ‌రకు బరువు కూడా తగ్గిపోయాడు. అందుకే ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మ స్లిమ్ గా కనిపిస్తున్నాడు. అయితే అలాంటి రోహిత్ శర్మకు తాజాగా అతని అభిమానులు వ‌డ‌పావ్ ఆఫర్ చేశారు. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

వ‌డ‌పావ్ వ‌ద్దురా నాయ‌న అంటూ సైగ‌లు

Advertisement

అయితే అక్కడికి వచ్చిన కొంత మంది అభిమానులు, రోహిత్ శర్మకు ఆఫర్ ఇచ్చారు. వ‌డ‌పావ్ తింటావా ? తీసుకువస్తామని పదేపదే రోహిత్ భాయ్ అంటూ పిలిచారు ఫ్యాన్స్. అయితే వెంటనే నాకు వద్దురా బాబు.. అంటూ వాళ్లకు సైగలు చేశాడు రోహిత్ శ‌ర్మ‌. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ తనకు ఇష్టమైన వ‌డ‌పావ్ కూడా వదిలి హనుమంతుడిలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI ) మధ్య 2026 కొత్త సంవత్సరంలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా కూడా ఈ కొత్త సంవత్సరంలో తొలిసారిగా న్యూజిలాండ్ తో ఆడుతోంది. జనవరి 11వ తేదీ అంటే ఆదివారం రోజు నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరుగుతుంది. ఇక రెండవ వన్డే జనవరి 14వ తేదీన రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఇక టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివ‌రి వ‌న్డే మ్యాచ్ జ‌న‌వ‌రి 18వ తేదీన ఇండోర్ స్టేడియంలో జ‌రగ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖరారు అయింది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జ‌రిగే వ‌న్డే సిరీస్ కోసం రోహిత్ శ‌ర్మ‌తో పాటు విరాట్ కోహ్లీ స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఈ టోర్న‌మెంట్ నేప‌థ్యంలో శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ పూర్తయిన వెంటనే ఈ రెండు జట్ల మధ్య 5 t20 ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ పూర్తికాగానే ఫిబ్రవరిలో టి20 ప్రపంచ క‌ప్ టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ జ‌రుగ‌నుంది.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×