E-Paper
Advertisement

IND VS SA ODI Series: రేప‌టి నుంచే వ‌న్డే సిరీస్‌.. వింటేజ్ లుక్ లో రోహిత్ శ‌ర్మ…ఫ్రీగా మ్యాచ్ లు చూడాలంటే

IND VS SA ODI Series: రేప‌టి నుంచే వ‌న్డే సిరీస్‌.. వింటేజ్ లుక్ లో రోహిత్ శ‌ర్మ…ఫ్రీగా మ్యాచ్ లు చూడాలంటే
Advertisement

IND VS SA ODI Series: దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa) మధ్య మొన్నటి వరకు టెస్ట్ సిరీస్ జరగగా, రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 3 వ‌న్డేల‌ సిరీస్ జ‌రుగ‌నుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. రేపు జార్ఖండ్ లోని రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదిక‌గా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా తొలి వ‌న్డే మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ త‌రుణంలోనే ఇప్ప‌టికే రాంచీకి చేరుకున్న రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు, గ్రౌండ్ లో గ్యాప్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఇద్ద‌రూ కూడా ప్రాక్టీస్ లో అద‌ర‌గొడుతున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

రేప‌టి నుంచి వ‌న్డే సిరీస్‌, టైమింగ్‌, ఫ్రీగా చూడాలంటే ఎలా

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా తొలి వ‌న్డే మ్యాచ్ రేపు జ‌రుగ‌నుంది. రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వేదిక‌గా జ‌రుగ‌నున్న ఈ మ్యాచ్, మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. అంటే మ‌ధ్యాహ్నం 1 గంట‌కు టాస్ ప్ర‌క్రియ ఉండ‌నుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మ‌ధ్య జ‌రుగ‌నున్న వ‌న్డే సిరీస్ ( IND VS SA ODI Series) జియో హాట్ స్టార్ వేదిక‌గా చూడ‌వ‌చ్చును. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో కూడా తిల‌కించవ‌చ్చును. అయితే, జియో హాట్ స్టార్ వేదిక‌గా ఫ్రీగా మ్యాచ్ లు తిల‌కించాలంటే, సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి. సబ్‌స్క్రిప్షన్ కోసం రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అప్పుడు ఫ్రీగా మ్యాచ్ లు చూడవ‌చ్చు.

వింటేజ్ లుక్ లో రోహిత్ శ‌ర్మ

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వింటే లుక్ లో రోహిత్ శర్మ దర్శనం ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ తొలగిపోయిన తర్వాత పూర్తిగా బరువు తగ్గిన రోహిత్ శర్మ, చాలా ఫిట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కంటే స్లిమ్ముగా రోహిత్ శర్మ దర్శనమిస్తున్నారు. ఇండియన్ క్రికెట్లోకి వచ్చిన కొత్తలో రోహిత్ శర్మ చాలా స్లిమ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు అతడి బరువు కూడా చాలా తక్కువ. అయితే ఇప్పుడు అదే స్థాయిలో బరువు తగ్గి కనిపించాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన రోహిత్ శర్మ అభిమానులు షాక్ అవుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడని, అందుకే ప్రతి నెల బరువు తగ్గుతూ వస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రోహిత్ శర్మ 22 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×