E-Paper
Advertisement

Rohit Sharma: కెమెరామెన్‌పై రోహిత్ శర్మ సీరియస్.. ఎందుకంటే?

Rohit Sharma: కెమెరామెన్‌పై రోహిత్ శర్మ సీరియస్.. ఎందుకంటే?
Advertisement

Rohit Sharma: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. కెమెరామెన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ మ్యాచ్ మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని హ్యాండ్స్‌కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్స్‌కు తగిలింది. అయితే దానిని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ డీఆర్ఎస్‌కు వెళ్లగా.. ఆ సమయంలో కెమెరామెన్ రీప్లే చూపించకుండా చాలా సేపు రోహిత్ శర్మను స్క్రీన్‌పై చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రోహిత్.. ‘‘నన్నెందుకు అంతగనం చూపిస్తున్నావు.. రిప్లై చూపించు’’ అంటూ సీరియస్ అయ్యాడు. అది విని పక్కన ఉన్న క్రికెటర్లు కాసేపు నవ్వుకున్నారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624315250748325888%7Ctwgr%5Eb0ee1f109435206988fd4ff49db7e9ca19e29ca5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-845177752434826516.ampproject.net%2F2301261900000%2Fframe.html

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×