E-Paper
Advertisement

Robin Uthappa: గంభీర్ పెద్ద దొంగ‌.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఆడితే, వ‌న్డే సిరీస్ గెలిచిన క్రెడిట్ ఖాతాలో వేసుకున్నాడు

Robin Uthappa: గంభీర్ పెద్ద దొంగ‌.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఆడితే, వ‌న్డే సిరీస్ గెలిచిన క్రెడిట్ ఖాతాలో వేసుకున్నాడు
Advertisement

Robin Uthappa:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir) మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు ఆడి గెలిపిస్తే క్రెడిట్ మొత్తం దొంగలిస్తున్నాడని మండిపడ్డారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో భాగంగా ఇదే జరిగిందని రాబిన్ ఉతప్ప వెల్లడించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మను ( Rohit Sharma) తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని కూడా బాంబు పేల్చారు. దీంతో స్టార్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

గంభీర్ పెద్ద దొంగ‌.. కోహ్లీ, రోహిత్ శ‌ర్మను ముంచుతున్నాడు

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్రెడిట్ దొంగతనం చేసే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు రాబిన్ ఉతప్ప. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాలని గుర్తు చేశారు. ఆ ఇద్దరి వల్లే టీమిండియా వన్డే సిరీస్ గెలిచిందని గుర్తు చేశారు రాబిన్ ఉతప్ప. వన్డే సిరీస్ ఇద్దరు క్రికెటర్లు గెలిపిస్తే క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్ తన ఖాతాలో వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మొన్న టెస్ట్ సిరీస్ గెలిస్తే మాత్రం టీమిండియా ప్లేయర్ల వైఫల్యం అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశాడు రాబిన్ ఉతప్ప.

ఇలాంటి హెడ్ కోచ్ ఉంటే టీమిండియా కు ప్రమాదమే అంటూ ఫైర్ అయ్యారు రాబిన్ ఉతప్ప. టీమిండియా గెలవాలంటే అందరూ రాణించాల్సిందే, ఓడితే అందరూ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. టీమిండియా ఓడిపోయినప్పుడు హెడ్ కోచ్ అన్ని బాధ్యతలు వహించాలని చురకలు అంటించారు. అంతేకానీ గెలిస్తే నాది, ఓడిపోతే మీది అన్నట్లుగా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తే, అతన్నీ ఎవరు కాపాడలేరని మండిపడ్డారు. కాగా దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రదర్శన కనబరిచినట్లు ప్రశంసించారు. వాళ్ళిద్దరు ఇలాగే కొనసాగితే 2027 వరల్డ్ కప్ టీమ్ ఇండియా వశం అవుతుందన్నారు రాబిన్ ఉతప్ప.

Advertisement

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మొదట టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ మాత్రం గెలిచింది. మొదటి అలాగే మూడవ వన్డే గెలిచిన టీమిండియా, వన్డే సిరీస్ కైవసం చేసుకోగలిగింది. ఇక మొన్న డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 టీ20 ల సిరీస్ కూడా ప్రారంభమైంది. ఇందులో మొట్టమొదటి టి20 మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. ఇవాళ మరో టి20 జరగనుంది.

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×