E-Paper
Advertisement

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..
Advertisement

Rishabh Pant :  టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)  గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇతను ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వరద పారించాడు. ఆడినటువంటి ఆరు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు, రెండు హాప్ సెంచరీలు సాధించి జట్టుకు కీలక పరుగులు అందించాడు. లార్డ్స్ జరిగిన టెస్ట్ లో కాలు వేలుకు గాయమైంది. మాంచెస్టర్ లో మరింత గాయం కావడంతో 5వ టెస్ట్ కి దూరమయ్యాడు. నాలుగో టెస్ట్ లో మాత్రం పంత్ కుంటుకుంటూ హాఫ్ సెంచరీ చేయడం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. తాాజాగా రిషబ్ పంత్  కోలుకుంటున్నట్టు ఫొటోలను షేర్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

Advertisement

పేద యువతికి సాయం.. 

“రిషబ్ పంత్ గా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.  నాకు అర్థమైంది. గతంలో మీరు ఎంత బాధను భరించినా పర్వాలేదు. మళ్ళీ గాయపడితే అది కూడా అలాగే బాధిస్తుంది. అది ఖచ్చితంగా.. కేవలం థ్రెషోల్డ్ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ మీకు తెలుసు. కాబట్టి సానుకూలంగా ఉండటం చాలా పెద్దది. మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడం చాలా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీరు మీ జీవితాన్ని తీసుకోవాలనుకునే దిశలో పని చేస్తూ ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చంపనిది చివరికి మిమ్మల్ని బలవంతం చేస్తుంది” అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక  రిషబ్ పంత్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో.. మానవత్వం ప్రదర్శించడంలోనూ అంతే దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డ పై పాదం ఫ్రాక్షర్ అయినా బరిలోకి దిగి యావత్ క్రికెట్ ప్రపంచంచే జేజేలు పలికించుకున్నాడు రిషబ్ పంత్. కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లాలోని రబ్కని గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో.. రిషబ్ పంత్ స్పందించి.. కాలేజీకి ఆన్ లైన్ ద్వారా ఫీజు చెల్లించాడు. దీంతో పంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

గాయం కారణంగా ఆసియా కప్ కి దూరం 

నాలుగోవ టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో మూడవ బంతిని.. పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కి తగిలి పంత్ కుడికాలు పాదానికి బలంగా తాకింది. దీంతో పంత్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. అనంతరం రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం గాయంతో మళ్లీ మైదానం లోకి అడుగుపెట్టి ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం పంత్ కి సర్జరీ అవసరం లేదని వైద్యులు సూచించారు. కానీ అతడు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పంత్ రెస్ట్ లోనే ఉన్నాడు. దీంతో ఆసియా కప్ కి దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడని.. రిషబ్ పంత్  గతంలో కూడా గాయపడి కోలుకున్నాడని.. ఇప్పుడు కూడా త్వరగానే కొలుకొని మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడని పలువురు అభిమానులు కోరుతున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×