E-Paper
Advertisement

Rinku Singh: ఈ గుండోడిని చీల్చిచెండాడిన రింకు సింగ్..ఆ లేడీ ముద్దుల వ‌ర్షం

Rinku Singh: ఈ గుండోడిని చీల్చిచెండాడిన రింకు సింగ్..ఆ లేడీ ముద్దుల వ‌ర్షం
Advertisement

Rinku Singh:  ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand, 1st T20I ) మధ్య నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో రింకు సింగ్ అదరగొట్టాడు. అందువచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు రింకు సింగ్. నిన్నటి మ్యాచ్ ఫినిషర్ రోల్ ప్రదర్శించాడు. కేవలం 20 బంతులలోనే 40 పరుగులు సాధించాడు. అంతేకాదు ఇండియాను వన్డే సిరీస్ లో వేధించిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ బౌలింగ్ లో ఏకంగా 20 కి పైగా పరుగులు సాధించాడు రింకు సింగ్ ( Rinku Singh). డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) వేసిన చివరి ఓవర్ లో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు కూడా సాధించాడు. దీంతో డారిల్ మిచెల్ వేసిన ఓవర్ లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. వన్డే సిరీస్ లో ఇండియాను ఆడుకున్న ఈ గుండోడి బౌలింగ్ ను రింక్‌ సింగ్ చీల్చి చెండాడు. ఈ నేపథ్యంలోనే రింకు సింగ్ బ్యాటింగ్ పై అతని కాబోయే ప్రియా సరోజ్ ( Priya Saroj ) తెగ సంబరపడిపోయింది. అంతేకాదు రింకు సింగ్ కు ఫ్లైయింగ్ కిస్‌ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

ఈ గుండోడిని చీల్చిచెండాడిన రింకు సింగ్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్నటి రోజున మొదటి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 20 ఓవర్లు వాడిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దారుణంగా ఓడిపోయింది న్యూజిలాండ్. అయితే ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రింకు సింగ్ ఫినిషర్ గా తన రోల్ ప్రదర్శించాడు. 20 బంతుల్లోనే ఏకంగా 44 పరుగులు సాధించాడు.

ఇందులో మూడు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 220 స్ట్రైక్ రేటుతో అదరగొట్టాడు రింక్ సింగ్. అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ వేయడం జరిగింది. అయితే అతని బౌలింగ్లో రింకు సింగ్ రెచ్చిపోయి ఆడాడు. రెండు సిక్సర్లు అలాగే రెండు బౌండరీలు సాధించాడు. దీంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో 21 పరుగులు సాధించాడు రింకు సింగ్. అయితే వన్డేలో ఇండియాను చీల్చి చెండాడు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్. ఈ నేపథ్యంలోనే ఆ గుండోడి పై రింకు సింగ్ రివేంజ్ తీర్చుకున్నాడు.

రింకు సింగ్ కు ముద్దుల వర్షం

Advertisement

ఇండియా తరఫున చివరి ఓవర్ లో అదరగొట్టిన రింకు సింగ్ కు ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ ముద్దుల వర్షం కురిపించిందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆమె ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చినట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వాస్తవంగా ఆమె ఈ నాగపూర్ టి20 మ్యాచ్ కు రాలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు కొంతమంది.

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×