E-Paper
Advertisement

Brett Lee: టీమిండియా కోసం రంగంలోకి బ్రెట్ లీ.. భారీ ప్యాకేజీ ?

Brett Lee: టీమిండియా కోసం రంగంలోకి బ్రెట్ లీ.. భారీ ప్యాకేజీ  ?
Advertisement

Brett Lee: భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీం ఇండియా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అలాగే సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుచిత్తుగా టెస్టుల్లో ఓడిపోయింది టీమిండియా. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా దారుణంగా ఓడిపోవడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో భాగంగానే… రంగంలోకి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రెట్ లీని దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్

Advertisement

టీమిండియా బౌలింగ్ కోచ్ గా బ్రెట్ లీ

టీమిండియా టెస్టుల్లో దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో…. బౌలింగ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ డేంజర్ ఆటగాడు బ్రెట్ లీని రంగంలోకి దింపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు చెబుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా.. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హెడ్ కోచ్గా ఉన్నప్పటికీ బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ కొనసాగుతున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఉన్న మోర్ని మోర్కెల్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దగా సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. అతన్ని తొలగించి… బ్రెట్ లీని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీతో చర్చలు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్యాకేజీ ఎంతైనా సరే… అతని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట. ఒకవేళ బ్రెట్ లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. టీమిండియా బౌలర్లకు మంచి రోజులు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Vijay Mallya: తీసుకున్న రుణాలు కట్టిన విజయ్ మాల్యాపై ట్రోలింగ్.. ‘ఊ లా లాలా లే ఓ’ జింగిల్ సీక్రెట్ ఇదే!

బ్రెట్ లీని మించిన బౌలర్ లేడు

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం, స్టార్ ఆటగాడు బ్రెట్ లీ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2003 వరల్డ్ కప్ సమయంలో ఆస్ట్రేలియాకు సేవలు అందించి ట్రోఫీని కూడా తీసుకువచ్చాడు. అలాగే 2006, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా-జట్టులో కూడా ఇతను ఉండడం గమనార్హం. అన్ని ఫార్మర్స్ లో మొత్తం 600కు పైగా వికెట్లు తీసి… చరిత్ర సృష్టించాడు. ఇది ఇలా ఉండగా… జూన్ 20వ తేదీ నుంచి టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా కీలకం. అయితే ఈ సిరీస్ కంటే ముందే బ్రెట్ లీ రంగంలోకి దింపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరో నాలుగు రోజుల్లోనే దీనిపై ప్రకటన వస్తుందని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×