E-Paper
Advertisement

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!
Advertisement

Virat Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఊహించని పరిణామం ఎదురైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో విరాట్ కోహ్లీ ఆడబోడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన అగ్రిమెంట్ ను విరాట్ కోహ్లీ రెన్యువల్ చేసుకోలేదని తెలుస్తోంది. ప్రతి ఏడాది ఈ రెన్యూవ‌ల్ అగ్రిమెంట్ పైన విరాట్ కోహ్లీ సంతకం చేస్తాడు. కానీ ఈ సారి మాత్రం విరాట్ కోహ్లీ ఈ అగ్రిమెంట్ పైన సంతకం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతోనే విరాట్ కోహ్లీ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు.

Also Read: Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటుకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అగ్రిమెంట్ పై కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు సంతకం చేయలేదని స‌మాచారం. ప్రతి ఏడాది తాను తీసుకునే అమౌంట్ కు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేస్తాడు కోహ్లీ. కానీ ఈ సారి ఇప్ప‌టి వ‌ర‌కు చేయలేద‌ట‌. సంత‌కం చేయ‌మ‌ని అడిగితే, కోహ్లీ ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో వ‌చ్చే సీజ‌న్ లో కోహ్లీ ఉండ‌డ‌ని అంటున్నారు. రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధం అయ్యార‌ని విరాట్ కోహ్లీపై వార్త‌లు వ‌స్తున్నాయి.

ప్రతి ఏడాది విరాట్ కోహ్లీకి 21 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. గతంలో 15 కోట్ల వరకు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. కానీ ఐపీఎల్ 2025 టోర్నమెంటు నుంచి విరాట్ కోహ్లీకి 21 కోట్ల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పైనే విరాట్ కోహ్లీ సంఘటన చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్న విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్నాడు.

Advertisement

ఇప్పటికే టెస్టులు అలాగే టీ20 లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ అనంతరం పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నాడని సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గెలుచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆ 18 సంవత్సరాలలో కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులోనే ఆడాడు విరాట్ కోహ్లీ. ఇక జట్టు టైటిల్ గెలవడంతో రిటైర్మెంట్ గా సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×