E-Paper
Advertisement

Venkatesh Iyer: ఒక‌ప్పుడు రూ.24 కోట్లు ప‌లికాడు, కానీ ఇప్పుడు రిజ‌ర్వ్ బెంచ్ కే ప‌రిమిత‌మ‌య్యాడు

Venkatesh Iyer: ఒక‌ప్పుడు రూ.24 కోట్లు ప‌లికాడు, కానీ ఇప్పుడు రిజ‌ర్వ్ బెంచ్ కే ప‌రిమిత‌మ‌య్యాడు
Advertisement

Venkatesh Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad,) తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రూ. 24 కోట్లు పలికిన వెంకటేష్ అయ్యర్, ఇప్పుడు రిజర్వు బెంచ్ కు పరిమితం అయ్యాడని క్రీడాభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుతున్నారు.

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

ఒక‌ప్పుడు రూ.24 కోట్లు ప‌లికాడు, కానీ ఇప్పుడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాగానే వెంకటేష్ అయ్యర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఒకప్పుడు 24 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోయిన వెంకటేష్ అయ్యర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. 24 కోట్లు పలికిన ప్లేయర్ ను రిజర్వ్ బెంచ్ లో బెంగళూరు కూర్చోబెట్టడంపై కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా అతనికి అవకాశం ఈ సీజన్ లో వచ్చే ఛాన్స్ లేదు అంటున్నారు. గత సీజన్ లో కేకేఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్, దారుణంగా విఫలమయ్యాడు. అందుకే ఈ సారి అయ్యర్ కు ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా రూ. 23.75 కోట్లు చెల్లించి వెంకటేష్ అయ్యర్ ను రిటైన్ చేసుకుంది కేకేఆర్ యాజమాన్యం. చాలా సీజన్లుగా ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు వెంకటేష్ అయ్యర్. అయితే 2025లో దాదాపు రూ.24 కోట్లు పలికిన వెంకటేష్ అయ్యర్, గత సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు.

గత సీజన్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడిన వెంకటేష్ అయ్యర్ కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. 24 కోట్లు పలికి ఇంత తక్కువ పరుగులు చేయడం పట్ల కేకేఆర్ యాజమాన్యం చాలా సీరియస్ అయింది. అందుకే 2026 మినీ వేలం సందర్భంగా వెంకటేష్ అయ్యర్ ను వదిలేసింది. ఈ క్రమంలో మినీ వేలంలో కేవలం ఏడు కోట్లకు మాత్రమే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంకటేష్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. దీంతో అతని రేటు అమాంతం పడిపోయింది. అయితే బెంగళూరులో వెంకటేష్ అయ్యర్ కు కచ్చితంగా స్థానం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో అతనికి స్థానం దక్కలేదు. రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.

ఇక రిజర్వ్ బెంచ్ కే వెంక‌టేష్ అయ్య‌ర్ ప‌రిమితం

Advertisement

ఇంపాక్ట్ ప్లేయర్ గా అతనికి అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ దేవదత్ పడిక్కల్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించింది రాయల్ చాలెంజెస్ బెంగళూరు యాజమాన్యం. ఈ అవకాశాన్ని దేవదత్ పడిక్కల్ అద్భుతంగా వినియోగించుకొని అర్థసంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్ లో వెంకటేష్ అయ్యర్ కు ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. తుది జట్టులో ఎవరైనా ఫెయిల్ అయితే, లేదా గాయపడితే తప్ప వెంకటేష్ అయ్యర్ కు అవకాశం వచ్చేలా కనిపించడం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం బెంగుళూరు ప్లేయింగ్ 11 లో ఏ ఒక్కరూ తప్పుకునేలా కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియా షెఫర్డ్ లాంటి ప్లేయర్లను తప్పించే ప్రయత్నం అస్సలు చేయరు. జితేష్ శర్మ మంచి ఫామ్ లోనే ఉన్నారు. కెప్టెన్ రజత్ పటిదార్ కూడా ఫిట్నెస్ గానే ఉన్నాడు. కాబ‌ట్టి ఈ సారి రిజర్వ్ బెంచ్ కే వెంక‌టేష్ అయ్య‌ర్ ప‌రిమితం కానున్నాడు.

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×