E-Paper
Advertisement

RCB IPL 2026 Auction: RCB నుంచి 10 మంది ప్లేయ‌ర్లు ఔట్‌..లిస్టులో కోహ్లీ కూడా ?

RCB IPL 2026 Auction: RCB నుంచి 10 మంది ప్లేయ‌ర్లు ఔట్‌..లిస్టులో కోహ్లీ కూడా ?
Advertisement
RCB IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే డిసెంబర్ మాసంలో ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో తమ జట్ల నుంచి వేలంలోకి వదిలేసే ప్లేయర్లను ఫైనల్ చేయాలని అన్ని బ్రాంచీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. నవంబర్ 15వ తేదీ లోపు రిలీజ్ చేసే ప్లేయర్లు అలాగే రిటైనింగ్ ప్లేయర్ల లిస్టును బీసీసీఐకి 10 ఫ్రాంచైజీలు అందించాల్సి ఉంటుంది. దీంతో ఏకంగా 10 మందిని వేలంలోకి వదిలేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

10 మంది ప్లేయర్లను వదిలి వేయనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

ఐపీఎల్ 2026 మినీ వేలానికి టైం దగ్గర పడింది. డిసెంబర్ 13 నుంచి 15 తేదీల మధ్య ఈ వేలం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నవంబర్ 15వ తేదీ లోపు రిటైన్‌ అలాగే రిలీజ్ ప్లేయర్ల లిస్టును ఐపీఎల్ యాజమాన్యం ముందు ఉంచాలని 10 ఫ్రాంచైజీలకు ఆదేశాలు వెళ్లాయి. ఇలాంటి నేపథ్యంలో 10 మంది ప్లేయర్లను వదిలేసేందుకు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడని సమాచారం. మయాంక్ అగర్వాల్,లియామ్ లివింగ్‌స్టోన్ , రసీఖ్ సలాం దార్ ,టిమ్ సీఫెర్ట్ , నువాన్ తుషార , స్వప్నిల్ సింగ్, కృనాల్ పాండ్య, యష్ దయాల్ , లుంగి ఎంగిడీ, మోహిత్ రథీ, అభినందన్ సింగ్ లాంటి కీలక ప్లేయర్లను కూడా వదిలేసేందుకు సిద్ధమైంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇలా మొత్తం పది మందిని వదిలేసి కొత్త జట్టును కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Also Read: Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

Advertisement

ప్రతి ఏడాది రూ. 21 కోట్లు తీసుకుంటున్న విరాట్ కోహ్లీ ( Virat Kohli ), ఐపీఎల్ 2026 ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేయలేదు. ఒకవేళ అతను సంతకం చేయకపోతే, కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు. అదే జరిగితే బెంగళూరు జట్టుకు 21 కోట్లు మిగులుతాయి. అటు మరో 9 మంది ప్లేయర్లను వదిలేస్తే 15 కోట్లు లభించనున్నట్లు సమాచారం అందుతుంది. అంటే బెంగళూరు చేతిలోకి దాదాపు 36 కోట్లు రాబోతున్నాయి. ఆ డబ్బులతో వేలంలో మంచి ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, 2024 ఐపీఎల టోర్న‌మెంట్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఛాంపియ‌న్ అయింది.

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×