E-Paper
Advertisement

WPL 2026-RCB: వ‌రుస‌గా 5 విజ‌యాలు ప్లే ఆఫ్స్ కు RCB..ఆ రెండు జట్లు ఎలిమినేట్‌..ఫైన‌ల్స్ సినారియో ఇదే

WPL 2026-RCB: వ‌రుస‌గా 5 విజ‌యాలు ప్లే ఆఫ్స్ కు RCB..ఆ రెండు జట్లు ఎలిమినేట్‌..ఫైన‌ల్స్ సినారియో ఇదే
Advertisement

WPL 2026-RCB:  ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా వరుసగా ఐదు విజయాలు నమోదు చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. వ‌రుస‌గా ఐదు విజయాలు నమోదు చేసుకున్న నేపథ్యంలో బెంగళూరు ఖాతాలో 10 పాయింట్లు వచ్చాయి. ఈ పాయింట్లతో 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ప్లే ఆఫ్ కు దూసుకు వెళ్ళింది. నిన్న గుజరాత్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ పై 61 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించి, ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్ళింది.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

వ‌రుస‌గా 5 విజ‌యాలు ప్లే ఆఫ్స్ కు RCB

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ ల‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు దుమ్ము లేపుతోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఓటమి లేని జట్టుగా దూసుకు వెళ్తోంది. మొట్టమొదట ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు, ఆ తర్వాత యూపీ వారియర్జ్ జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత గుజరాత్ పైన విజయం సాధించిన రాల్చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా చిత్తు చేసింది. ఇక లేటెస్ట్ గా మరోసారి గుజరాత్ జట్టును చిత్తు చేసిన బెంగళూరు.. నేరుగా ప్లే ఆఫ్ లోకి దూసుకు వెళ్ళింది. వరుసగా 5 మ్యాచ్ లు ఆడి , 5 విజయాలను నమోదు చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, మొత్తం 10 పాయింట్లు సాధించింది. దీంతో ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరుకున్న మొట్టమొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక బెంగళూరు తర్వాత ముంబై ఇండియన్స్ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. అటు యూపీ కూడా రెండు విజయాలు నమోదు చేసుకొని మూడవ స్థానంలో రన్ రేట్ ప్రకారం ఉంది.

ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబై అలాగే యూపీ తమ మిగిలిన మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాలి. అప్పుడే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఎటు గుజరాత్ అలాగే ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు గుజరాత్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. రన్ రేట్ ప్రకారం నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. తన తర్వాతి మ్యాచ్ లలో మంచి రన్ రేట్ సాధించడమే కాకుండా విజయాలను నమోదు చేసుకుంటే ప్లే ఆఫ్ ఉంటాయి. ఇక ఢిల్లీ ఒకే ఒక్క విజయం నమోదు చేసుకుంది. ఈ టీం ఎంత కష్టపడ్డా, అదృష్టం కలిసి వస్తే తప్ప ఆ ప్లే ఆఫ్ కు చేరడం కష్టమే. అంటే బెంగళూరు, యూపీ అలాగే ముంబై మూడు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సులు ఎక్కువ. మిగిలిన గుజరాత్ అలాగే ఢిల్లీ ఇంటి దారి పట్టే ఛాన్స్ ఎక్కువ.

ఫైనల్స్ సినారియో ఎలా అంటే ?

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఇప్పటికే రాయల్ చాలెంజెస్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌ కు చేరుకుంది. మరో రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు రావాల్సి ఉంటుంది. ఒకవేళ బెంగళూరు నెంబర్ వన్ స్థానంలో చివరి వరకు ఉంటే.. నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. అందులో గెలిచినట్టు బెంగళూరు తో ఫైనల్ ఆడనుంది.

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×