E-Paper
Advertisement

Rohith- Ashwin : రోహిత్ శర్మ పెద్ద సెల్ఫీష్..? అశ్విన్ షాకింగ్ కామెంట్స్

Rohith- Ashwin : రోహిత్ శర్మ పెద్ద సెల్ఫీష్..? అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Rohith- Ashwin : టీమిండియా క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టీ-20, టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కేవ‌లం వ‌న్డే క్రికెట్ కి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన సౌతాఫ్రికా సిరీస్ లో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఫామ్ క‌న‌బ‌రిచారు. మ‌రోవైపు తాజాగా విజ‌య్ హ‌జారే ట్రోఫీలో కూడా ముంబై త‌ర‌పున రోహిత్ శ‌ర్మ, ఢిల్లీ త‌ర‌పున విరాట్ కోహ్లీ ఇద్ద‌రూ ఒకే రోజు సెంచ‌రీలు చేయ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా టీమిండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ రోహిత్ శ‌ర్మ‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం అత‌ని కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : Sara Tendulkar : గిల్ ను పిచ్చోడిని చేసిన సారా… వాడితో క్రిస్మస్ సంబరాలు.. రొమాంటిక్ ఫోటోలు వైరల్!

రోహిత్ శ‌ర్మ పై అశ్విన్ సెన్షేష‌న‌ల్ కామెంట్స్

Advertisement

రోహిత్ శ‌ర్మ పై ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. టీమిండియా ఓపెన‌ర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెల్ఫిష్ కాదని వెల్లడించాడు అశ్విన్. రోహిత్ శ‌ర్మ‌ చాలా మంది కుర్ర క్రికెటర్లకు సహాయం చేశాడు. కుర్ర క్రికెట‌ర్లంద‌రికీ అవ‌కాశాలు ఇస్తూ.. తన కెరీర్ సాక్రిఫైజ్ చేశాడు రోహిత్ శ‌ర్మ‌. టీ-20ల్లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో అభిషేక్ శ‌ర్మ వంటి మెరుగైన క్రికెట‌ర్ టీమిండియా జ‌ట్టులో చేరాడు. అలాగే టెస్ట్ ల‌కు కూడా త్వ‌ర‌గానే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. యంగ్ క్రికెట‌ర్ల‌కు ఎక్కువ‌గా ఛాన్స్ లు ఇచ్చేందుకు ఆస‌క్తి చూపిస్తుంటాడు. వారి కోసం త‌న కెరీర్ ని త్వ‌ర‌గా ముగింపు ప‌లికాడు ఈ క్రికెట‌ర్. జ‌ట్టు కోసం ప‌రుగులు సాధించ‌డానికి.. త‌రుచూ త్యాగం చేస్తుంటాడు. రోహిత్ శ‌ర్మ ప‌ట్ల త‌న‌కు చాలా గౌర‌వం ఉంది అని చెప్పుకొచ్చాడు అశ్విన్.

అశ్విన్ రిటైర్మెంట్ కి కార‌ణం అదేనా..?

ఇటీవ‌లే ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స‌మ‌యంలో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. బోర్డ‌ర్-గావ‌స్క‌ర్ ట్రోఫీలో ఆసీస్ తో జ‌రిగిన టెస్ట్ సిరీస్ లో అశ్విన్ రిజ‌ర్వ్ బెంచ్ పై కూర్చొబెట్ట‌డం వ‌ల్ల‌నే అశ్విన్ నిరుత్సాహానికి గురై వీడ్కోలు చెప్పిన‌ట్టు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు సైతం పేర్కొన్నారు. ఆ త‌రువాత కొద్ది నెల‌ల త‌రువాత ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పాడు. భార‌త్ త‌ర‌పున స్పిన్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే 619 వికెట్ల త‌రువాత.. 106 టెస్ట్ ల్లో 537 వికెట్లు తీశాడు అశ్విన్. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో కూడా భార‌త్ నుంచి అశ్విన్ ఎక్కువ వికెట్లు తీయ‌డం విశేషం. మ‌రోవైపు 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున అరంగేట్రం చేసిన అశ్విన్.. 2025 సీజన్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గతేడాది డిసెంబర్‌లోనే వీడ్కోలు పలికిన ఈ ఆఫ్ స్పిన్నర్, ఇప్పుడు విదేశీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఐపీఎల్ సీజ‌న్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుతోనే ప్రారంభించి.. ఆ జ‌ట్టుతోనే ముగించ‌డం విశేషం.

Advertisement

Also Read : Rohith-Virat : ‘సీసీటీవీల్లో రికార్డు చేశారా?’.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×