E-Paper
Advertisement

Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే
Advertisement

Ravichandran Ashwin: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 ఓ చెత్త టోర్నమెంట్ అంటూ ఫైర్ అయ్యారు అశ్విన్. ఇలాంటి టోర్నమెంట్ లో టీమిండియా ఆడడం దండగ అంటూ సూచనలు ఇచ్చారు. టి20 ప్రపంచ కప్ లో 20 జట్లు ఆడడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. తక్కువ జట్లతో కీలకమైన టీమ్స్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని కోరారు.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

టి20 ప్రపంచ కప్ పై అశ్విన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టి20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఆ టోర్నమెంట్ ను కించపరిచేలా రవిచంద్రన్ అశ్విన్ హాట్ కామెంట్స్ చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చూసే నాధుడే లేదని, చిన్న జట్లపై టీమిండియా ఆడితే ఎవడు చూస్తాడని నిలదీశారు. ఇండియా వర్సెస్ యుఎస్ఏ, టీమిండియా వర్సెస్ నమీబియా ఇలా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో మొదటి మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఆ మ్యాచ్ లలో టీమిండియా సులభంగానే విజయం సాధిస్తుంది.. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ గా నడుస్తుంది.. అలాంటప్పుడు ఈ రెండు జడ్ల మధ్య మ్యాచ్ ఎందుకు పెట్టడం అని మండిపడ్డారు.

1996, 1999, 2003 ఆ సమయంలో తాను స్కూల్ వెళ్లేవాడ్ని.. అప్పుడు టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్, టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచులు జరిగేవి. ఆ మ్యాచులు చూస్తుంటే మరింత ఆసక్తిగా మారేవి.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని అశ్విన్ చెప్పే ప్రయత్నం చేశారు. పసికూన జట్లపైన మ్యాచ్ లు నిర్వహిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని మండిపడ్డారు. ఇకనైనా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో పెద్ద జట్లతో టీమిండియా ఆడేలా, చూడాలని వివరించారు. లేకపోతే ఈ ప్రపంచకప్ చూసేవాడు అస్సలు ఉండకూడని… అందరూ టీవీ సీరియల్స్ చూస్తారని స్పష్టం చేశారు.

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20 world cup 2026 ) షెడ్యూల్ ఇప్ప‌టికే ఫిక్స్ అయింది. ఈ టోర్న‌మెంట్ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ టోర్న‌మెంట్ లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొంటాయి. 4 గ్రూప్ లుగా ఈ 20 జ‌ట్లను విభ‌జించారు. శ్రీలంక‌, ఇండియా సంయుక్తంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నిర్వ‌హిస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన పాక్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×