E-Paper
Advertisement

Ravi Shastri: కోహ్లీ, రోహిత్‌ల జోలికి రావొద్దు… గంభీర్ కు హెచ్చరిక

Ravi Shastri: కోహ్లీ, రోహిత్‌ల జోలికి రావొద్దు… గంభీర్ కు హెచ్చరిక
Advertisement

Ravi Shastri: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ – రోహిత్ శర్మ లను 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడించకూడదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అనుకుంటున్నాట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు చూస్తే మాత్రం వారిని జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం కూడా.

Also Read: Rohit Sharma: రిటైర్మెంట్ వెన‌క్కి.. టీ-20ల్లోకి వ‌చ్చేస్తున్న రోహిత్ శ‌ర్మ‌..?

Advertisement

ప్రస్తుతం వీరిద్దరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్ళు మూయించాడు. ఇక రోహిత్ శర్మ తొలి వన్డేలోనే ఆఫ్ సెంచరీతో దూకుడు ప్రదర్శించాడు. ఈ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా టూర్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అయితే 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ లకు దాదాపు 39 ఏళ్లు ఉంటాయి. అందుకే వీరిద్దరి భవిష్యత్తు గురించి నిరంతరం చర్చ జరుగుతుంది.

 

రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ ల జోలికి రావద్దు:

Advertisement

రో-కో ల భవిష్యత్తుపై జరుగుతున్న చర్చపై భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల కెరీర్ తో ఆడుకోవాలని చూస్తున్నారని కొందరికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఇద్దరి విషయంలో అనవసరంగా తల దూర్చవద్దని స్పష్టం చేశారు. తాజాగా ప్రభాత్ ఖబర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి శాస్త్రి మాట్లాడుతూ.. ” విరాట్ – రోహిత్ వన్డేల్లో అద్భుతమైన ఆటగాళ్లు. అలాంటి స్థాయి ఉన్న ఆటగాళ్లతో ఆడుకోవద్దు” అన్నారు. అయితే వారికి ఇబ్బందులు ఎవరు సృష్టిస్తున్నారు..? అని ప్రశ్నించగా.. “కొంతమంది చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఇంతే చెప్పగలను. ఒకవేళ ఆ ఇద్దరి మైండ్ సెట్ కుదురుకొని, సరైన బటన్ నొక్కితే.. చుట్టూ ఉన్నవాళ్లంతా కనుమరుగైపోతారు”. అని కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ని ఉద్దేశించి రవి శాస్త్రి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Mitchell Starc: వ‌సీం అక్ర‌మ్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఏకంగా 415 వికెట్ల‌తో

 

గంభీర్ కి కూడా హెచ్చరిక చేసిన రవి శాస్త్రి:

స్వదేశంలో రెండు టెస్ట్ సిరీస్ లో కోల్పోవడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ క్రమంలో మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి బుధవారం ఓ కీలక హెచ్చరికతో పాటు ఓ సూచన చేశాడు. ” నీ పనితీరు బాలేదు. ఉద్యోగం పోయే ప్రమాదం తప్పదు. అన్నిటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఎటువంటి సమయాలలో ఐనా ఓర్పు అవసరం. మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ కీలకం. జట్టు గెలుపొందాలంటే నువ్వు ఆటగాళ్లని ప్రోత్సహించాలి. మేము కోచ్ గా ఉన్న సమయంలో అదే చేశాము. జట్టును గెలిపించాలనుకుంటే నువ్వు ఒత్తిడికి గురికాకూడదు. ఆ పనిని ఆస్వాదించగలగాలి”. అని గంభీర్ కి రవి శాస్త్రి సూచించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×