E-Paper
Advertisement

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ
Advertisement

Ravi Shastri On Usman Tariq bowling:  పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని సినిమా చూసి క్రికెట్లోకి వచ్చిన పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ తారిక్, అద్భుతమైన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ కాస్త విభిన్నంగా ఉన్న తరుణంలో, బ్యాటర్లు త్వరగా ఔట్ అవుతున్నారు. అయితే కొంతమంది అతడి బౌలింగ్ యాక్షన్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అతడిని మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా లాగానే.. ఉస్మాన్ తారిక్ కూడా గొప్ప బౌలర్ అంటూ వ్యాఖ్యానించారు. ఉస్మాన్ తారిక్ లాంటి బౌలర్ ను కలిగి ఉన్న పాకిస్తాన్… ఎంతో అదృష్టం చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉస్మాన్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ ఒకడు అంటూ కితాబ్ ఇచ్చారు. బుమ్రా కంటే ఒకానొక సమయంలో ఉస్మాన్ తారిక్ అద్భుతంగా బౌలింగ్ చేయగలరని వెల్లడించారు. అతను చేయగలిగిన పని మరే ఇతర బౌలర్ చేయలేడని వ్యాఖ్యానించారు. ఏ కెప్టెన్ కూడా ఉస్మాన్ తారిక్ ఓవర్ మార్చాలని అనుకోడని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక సమయాలలో ఇతడి బౌలింగ్ వినియోగించుకుంటే… పాకిస్తాన్ కచ్చితంగా విజయ అవకాశాలను పెంచుకుంటుందన్నారు. ప్రత్యర్థి బ్యాటర్ ను ఒత్తిడిలోకి పంపేందుకు ఉస్మాన్ తారిక్ బాగా పనికి వస్తాడని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను మెచ్చుకున్నందుకు రవి శాస్త్రి పై ఇండియన్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పక్కోడిని మెచ్చుకోవడానికి సిగ్గుగా లేదా ? అని ఫైర్ అవుతున్నారు.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు

Advertisement

పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అతడు చెయ్యి వంకరగా పెట్టి బౌలింగ్ చేస్తాడు. దీంతో అతడిది ఈ త్రో బౌలింగ్ అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రీన్, టిమ్ డేవిడ్ సైతం బహిరంగంగానే వెల్లడించారు. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను అవమానించారు. వాస్తవానికి ఉస్మాన్ తారిక్ చెయ్యి కాస్త వంకరగా ఉంటుంది. అందుకే అతడు వేసిన బంతి త్రో లాగా కనిపిస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం అతడు సరైన బౌలింగే వేస్తున్నాడు. అందుకే అతని బౌలింగ్ చెల్లుబాటు అవుతోంది. ఇదే విషయాన్ని రవి శాస్త్రి కూడా వెల్లడించారు. అనవసరంగా అతని బౌలింగ్ ను కించపరచకూడదని కోరారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×