E-Paper
Advertisement

Ravi Shastri: నంబర్-3లో అక్షర్ పటేల్ అవ‌స‌ర‌మా? చేత‌కాక‌పోతే ఇంట్లో కూర్చో, గంభీర్ కు హెచ్చ‌రిక !

Ravi Shastri:  నంబర్-3లో అక్షర్ పటేల్ అవ‌స‌ర‌మా?  చేత‌కాక‌పోతే ఇంట్లో కూర్చో, గంభీర్ కు హెచ్చ‌రిక !
Advertisement

Ravi Shastri: టీం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గురువారం రోజున న్యూ చండీగఢ్ లోని ముల్లాన్పూర్ వేదికగా రెండో టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ సేన అత్యంత దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది టీమిండియా. అయితే ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. గౌతమ్ గంభీర్ కు కోచింగ్ చేయడం రావడంలేదని, చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రవి శాస్త్రి. అతడు ఇలాగే చేస్తే టీమిండియా గెలవడం కష్టమైందని పేర్కొన్నారు.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

చేతకాకపోతే ఇంట్లో కూర్చో.. గంభీర్ కు రవి శాస్త్రి వార్నింగ్

Advertisement

దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై విమర్శలు మళ్లీ పెరిగిపోయాయి. టీమిండియా అభిమానులు, మాజీ క్రికెటర్లు, మాజీ కోచ్ లు సీరియస్ అవుతున్నారు. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా విమర్శలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పదే పదే మార్చడం దారుణమన్నారు. మూడో వికెట్ కు వచ్చే వాళ్లను అస్సలు డిస్టర్బ్ చేయకూడదని పేర్కొన్నారు. రెండో టి20లో అనవసరంగా అక్షర్ పటేల్ ను దించి గౌతమ్ గంభీర్ పెద్ద మిస్టేక్ చేసాడని మండిపడ్డారు రవి శాస్త్రి. 214 పరుగుల భారీ లక్ష్యం ఉన్న సమయంలో మూడవ నెంబర్లు తిలక్ వర్మాను దించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చురకలు అంటించారు.

అలా కాకుండా అక్షర్ పటేల్ ను దించి చెత్త పని చేశావని ఫైర్ అయ్యారు. సూర్య కుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ మూడవ స్థానంలో వచ్చి ఉంటే టీమిండియా గెలిచేది అన్నారు. పాపం 5వ స్థానంలో తిలక్ వర్మాను దించడం వల్ల అతనిపై ఒత్తిడి పెరిగిందని నిప్పులు చెరిగారు. శివం దుబేకు సరిగా అవకాశం రాలేదన్నారు. అతన్ని కూడా కాస్త ముందుకు బ్యాటింగ్ చేయిస్తే ఫలితం బాగుంటుందన్నారు. అలా కాదని తన ఇష్టం వచ్చినట్లు గౌతమ్ గంభీర్ చేస్తే, టి20 వరల్డ్ కప్ గెలవడం కష్టమేనన్నారు.

Advertisement

చేతకాకపోతే ఇంట్లో గౌతమ్ గంభీర్ కూర్చోవాలని ఫైర్ అయ్యారు రవి శాస్త్రి. నీకంటే తోపు లాంటి వాళ్లు మరొకరు వస్తారని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 20 ఓవర్లు ఆడి, నాలుగు వికెట్లు నష్టపోయి 213 పరుగులు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా జట్టు దారుణంగా విఫలమైంది. 19.2 ఓవర్లు ఆడిన టీమిండియా 162 పరుగులకు కుప్ప కూలింది. దీంతో 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×