E-Paper
Advertisement

CSK VS SRH: తెలంగాణ, ఏపీ మ‌ధ్య చిచ్చుపెట్టిన ర‌విశాస్త్రి..వీడియో వైర‌ల్

CSK VS SRH: తెలంగాణ, ఏపీ మ‌ధ్య చిచ్చుపెట్టిన ర‌విశాస్త్రి..వీడియో వైర‌ల్
Advertisement

CSK VS SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 కు పైగా ఈ టోర్నమెంట్ లో మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ప్రతి మ్యాచ్ కూడా చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మాజీ క్రికెటర్, కామెంటేట‌ర్‌ ( Commentator) రవి శాస్త్రి చిచ్చుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Chennai Super Kings) మధ్య నిన్న ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగగా, ఈ సందర్భంగా బాగున్నారా ? తెలంగాణ అంటూ తన కామెంట్రీ షురూ చేశాడు ర‌విభాయ్. ఈ ఒక్క పదమే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదే అన్నట్లుగా రవి శాస్త్రి కామెంట్రీ ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన SRH ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవి శాస్త్రి ( Ravi Shastri ) చిచ్చుపెట్టాడని ఫైర్ అవుతున్నారు. ర‌విశాస్త్రిని బ్యాన్ చేయాల‌ని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు

తెలంగాణ, ఏపీ మ‌ధ్య చిచ్చుపెట్టిన ర‌విశాస్త్రి..వీడియో వైర‌ల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శనివారం 7:30 గంటలకు మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ ఏడు గంటలకు వేయగా, ఆ సమయంలో రవి శాస్త్రి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. టాస్ వేసే కంటే ముందు గుడ్ ఈవెనింగ్ హైదరాబాద్.. అంటూ చాలా మంది కామెంట్రీ ఇచ్చేవాళ్లు. కానీ రవి శాస్త్రి అలా కాకుండా, కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించి వివాదంలో చిక్కుకున్నాడు. బాగున్నారా ? తెలంగాణ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ చేత టాస్ వేయించాడు. అయితే టాస్ అంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం తెలంగాణకు సంబంధించినదే.. ఇందులో ఏపీకి ఎలాంటి సంబంధం లేదన్న తరహాలోనే రవి శాస్త్రి మాట్లాడాడు.

ఈ అంశం ఏపీలోని SRH అభిమానులకు కోపం తెప్పించింది. రవి శాస్త్రికి సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా యుద్ధమే ప్రారంభించారు ఏపీకి సంబంధించిన SRH అభిమానులు. హైదరాబాద్ జట్టు అందరిదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ అలాగే ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది. ఇలాంటి సమయంలో ప్రాంతాల మధ్య రవి శాస్త్రి చిచ్చు పెడుతున్నాడని సీరియస్ అవుతున్నారు. తమ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన రవి శాస్త్రిని బ్యాన్ చేయాలని.. ఇకపై ఐపీఎల్ లో కనిపించకుండా చేయాలని బీసీసీఐని కోర్టు పోస్టులు కూడా పెడుతున్నారు. SRH జ‌ట్టును తెలంగాణ‌తో పాటు ఏపీ ఫ్యాన్స్ ను ఆరాధిస్తున్నార‌ని, ఈ విష‌యం గుర్తుపెట్టుకుని ర‌విశాస్త్రి వ్య‌వ‌హ‌రిస్తే బాగుండు అంటున్నారు. దీనిపై బీసీసీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

 

 

Also Read: Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×