E-Paper
Advertisement

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా
Advertisement

Rashid latif On Afghanistan Cricket:  ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులో ( Afghanistan Cricket) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు ఉన్నాయి. కెప్టెన్లు వస్తున్నారు.. పోతున్నారు. పర్మ‌నెంట్ కెప్టెన్ ఎవరనేది క్లారిటీగా తెలియడం లేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ వన్డే కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (Hashmatullah Shahidi) తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. త్వరలోనే వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. అయితే ఉన్నఫలంగా వన్డే కెప్టెన్ (ODI Captain) తప్పుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో సంక్షోభం నెలకొంది. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ లో సంక్షోభం నెల‌కొంద‌ని…త్వ‌ర‌లోనే ఆ టీమ్ అంత‌రించిపోనుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ర‌షీద్ ల‌తీఫ్. ఈ క్ర‌మంలోనే ఆఫ్ఘనిస్థాన్ ను వ‌దిలేసి, పాకిస్తాన్ జ‌ట్టులోకి ( Pakistan Team) రండి అంటూ సూచ‌న‌లు కూడా చేశారు. దీంతో ర‌షీద్ ల‌తీఫ్ (Rashid latif ) చేసిన వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే అంత‌రించిపోనుంది

Advertisement

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని బాంబు పేల్చారు. ఆ జట్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. పాత కెప్టెన్స్ వెళ్ళిపోతున్నారు.. కొత్తవాళ్లు వస్తున్నారు… ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగానే.. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్లను మార్చేస్తున్నారని బాంబు పేల్చారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టులో ఉన్న క్రికెటర్లు తలలు పట్టుకుంటున్నారని హేళన చేశారు. ఆ జట్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న తరుణంలో…. ప్లేయర్లు ఆటపైన ఏకాగ్రత పెట్టలేకపోతున్నారని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ తీవ్రమైన అంతర్గత రాజకీయాలను ఎదుర్కొంటుందని ఆరోపణలు చేశారు.

ఇది భవిష్యత్తులో ఆ దేశ క్రికెట్ కు హాని కలిగించే ప్రమాదం పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును కూడా కనుమరుగు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ పరిస్థితి రాకముందే… ప్లేయర్ లందరూ పాకిస్తాన్ కు వచ్చేయాలని సూచనలు చేశారు. తమ పాకిస్తాన్ జట్టులో అద్భుతమైన అవకాశాలు వస్తాయని వివరించారు. రాకపోయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి టోర్నమెంట్లు వాడుకోవచ్చని తెలిపారు. ఆఫ్గనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. క్రికెటర్ల పట్ల తమ బోర్డు సానుకూలంగా ఉంటుందని వివరించారు. తన ఆఫర్స్ స్వీకరించి… ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి పాకిస్తాన్ కు రావాలని కోరారు. అయితే దీనిపై ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతరించిపోతే.. ఇండియాకు వెళ్తాం తప్ప… పాకిస్తాన్ లో అడుగు పెట్టేది లేదని చెబుతున్నారు.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×