E-Paper
Advertisement

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ లో 400 మంది మృతి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ పాకిస్తాన్ పై ర‌షీద్ ఖాన్ పోస్ట్

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ లో 400 మంది మృతి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ పాకిస్తాన్ పై ర‌షీద్ ఖాన్ పోస్ట్
Advertisement

Rashid Khan:  ఆఫ్ఘనిస్తాన్ పై మరోసారి తన కుట్రలను మరోసారి పాకిస్తాన్ ( Pakistan) బయటపెట్టింది. అర్ధరాత్రి గుర్తు చప్పుడు కాకుండా రంజాన్ మాసంలో అమాయక ప్రజలపై వైమానిక దాడులకు ( airstrike kills) పాల్పడింది పాకిస్తాన్. ఈ సంఘటనలో మొత్తం 400 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ( Kabul) లో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రి పై పాకిస్తాన్ అర్ధరాత్రి దాడి చేసింది. వైమానిక దాడి చేసిన నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు 400 మంది ఆఫ్గాన్ పౌరులు మృతి చెందారు. చాలా మంది గాయాల పాలయ్యారు. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్, పాక్ ( Pakistan-Afghanistan War ) మ‌ధ్య మ‌ళ్లీ యుద్ధ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఈ ఆస్ప‌త్రి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ( Rashid Khan ) ఎమోషనల్ అయ్యారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌరులపై బాంబులు వేయడం యుద్ద నీతి కాదని పాకిస్తాన్ పరువు తీశారు. ఎదురుగా యుద్ధం చేయడం చేతకాని దద్దమ్మ అంటూ పాకిస్తాన్ పై మండిపడ్డారు రషీద్ ఖాన్. దీంతో రషీద్ ఖాన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

పాకిస్తాన్ దాడిపై ర‌షీద్ ఖాన్ సీరియ‌స్‌

Advertisement

కాబూల్ లోని ( Kabul) డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ పై (ఆస్పత్రి ) పాకిస్తాన్ వైమానిక దాడి చేసిన నేపథ్యంలో 400 మంది మరణించారు. అయితే దీనిపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ( Rashid Khan) ఎమోషనల్ అయ్యారు. పాకిస్తాన్ పై మండిపడ్డారు. పాకిస్తాన్ కు యుద్ద నీతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై బాంబులు వేయడం యుద్ద నేరమని చురకలు అంటించారు.

పవిత్రమైన రంజాన్ మాసంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మరణించడం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఆ వందల మంది జీవితాలను పొట్టను పెట్టుకున్న పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించి పాకిస్తాన్ పై శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, జననివాసాలపై బాంబులు వేయడం అసలు యుద్ధమే కాదని.. చేతకానితనమని పాకిస్తాన్ కు చురకలు అంటించారు.

Advertisement

ఈ పాకిస్తాన్ దాడి చేసిన సంఘటనపై రషీద్ ఖాన్ ఒక్కడే కాదు… మహమ్మద్ నబీ లాంటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు అందరూ స్పందిస్తున్నారు. రంజాన్ మాసంలో జరిగిన ఈ సంఘటనపై ఎమోషనల్ అవుతున్నారు. దీనిపై అంతర్జాతీయంగా విచారణ జరగాలని.. పాకిస్తాన్ కు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే దాడి జరిగిన ఆసుపత్రిలో ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రోగులకు తమ వంతు సహాయం చేశారు.

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×