E-Paper
Advertisement

Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !
Advertisement

Ramiz Raja:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament)   నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెటర్లు అలాగే స్పోర్ట్స్ అనలిస్టులు ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ( Ramiz Raja) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ( Pm Modi) కనుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నామరూపాలు లేకుండా భూస్థాపితం అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇండియాతో పెట్టుకుంటే.. ఆర్థికంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు నష్టం జరుగుతుందని హెచ్చరించాడు రమీజ్ రాజా. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, రమీజ్ రాజా ఈ వ్యాఖ్య‌లు గ‌తంలో చేయ‌గా, ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయ‌ని అంటున్నారు.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (T20 World Cup 2026 tournament) భాగంగా ఇండియా త జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్ కాట్‌ చేసింది. అయితే ఈ అంశంపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా ( Ramiz Raja) స్పందించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును తప్పుపడుతూ రమీజ్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో అస్సలు పెట్టుకోకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వచ్చే నిధులలో 50% కోసం ఐసీసీ పైన ఆధార పడాల్సిన పరిస్థితి ఉందని గుర్తు చేశారు.

అలాగే ఐసీసీకి వచ్చే 90% నిధులు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి వస్తాయని రమీజ్ రాజా షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. ఒకవేళ భారత ప్రధాని నరేంద్ర మోడీకి రేపు కోపం వస్తే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ కనుసైగ చేసి నిధులను ఆపేస్తే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడుతుందని… భూస్థాపితం కావడం గ్యారెంటీ అన్నారు. ఈ విషయాలను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టి20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament) ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 8వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఇండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగాల్సి ఉంది.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×