E-Paper
Advertisement

Harsh Goenka: కోట్ల‌ల్లో న‌ష్టాలు… అమ్మకానికి రెండు IPL జట్లు

Harsh Goenka: కోట్ల‌ల్లో న‌ష్టాలు… అమ్మకానికి రెండు IPL జట్లు
Advertisement

Harsh Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఒకటి కాదు ఏకంగా రెండు ఫ్రాంచైజీలు అమ్మకానికి ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ఇటీవల 2025 ఐపీఎల్ ఛాంపియన్స్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొత్త యాజమాని కోసం వెతకడం ప్రారంభించాయి.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

Advertisement

ఆర్సిబి ఫ్రాంచైజీ విలువ ప్రస్తుతం దాదాపు రెండు బిలియన్లు. అంటే సుమారు రూ. 17, 587 కోట్లు. అయితే ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడానికి 6 కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ ఆరింటిలో ఇప్పటికే ఓ ఐపీఎల్ జట్టును కలిగి ఉన్న కంపెనీ కూడా ఉంది. బయ్యర్ దొరికితే 2026 మార్చి 31 నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్చి 31కి ఆర్సిబి జట్టు అమ్మకం పూర్తయితే మరో పేరుతో ఆర్సిబి జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరో ఫ్రాంచైజీ కూడా అమ్మకానికి సిద్ధమైనట్లు సమాచారం.

 

అమ్మకానికి సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్:

Advertisement

తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా చేతులు మారనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ జట్టును దక్కించుకునేందుకు ఐదుగురు కొనుగోలుదారులు రేసులో ఉన్నారు. వారిలో ఈ ఫ్రాంచైజీ ఎవరికి దక్కనుందో..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూణే, అహ్మదాబాద్, ముంబై, యూఎస్ఏ, బెంగళూరు.. కొత్త యాజమానులు ఎక్కడినుంచి వస్తారో..? అంటూ హర్ష్ గొయెంకా తన ఎక్స్ {ట్విట్టర్} ఖాతాలో ట్వీట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు.. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చేతిలో ఉంది. ఈ కంపెనీకి ఫ్రాంచైజీలో 65% వాటా ఉంది. ఇలా రెండు ప్రాంచైజీలు ఇప్పుడు అమ్మకానికి రావడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Also Read: RCB: హెడ్, క్లాసెన్ లాంటి రాక్షసులను బెంగుళూరు వదిలేసిందా.. షాకింగ్ లిస్ట్ ఇదే

 

కోట్లల్లో నష్టాలు:

ఈ రెండు ఫ్రాంచైజీలకు కోట్లల్లో నష్టాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 2008లో ఒక్కసారి మాత్రమే టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఇక 2022లో ఫైనల్ వరకు వెళ్ళి బోల్తా పడింది. 2025 సీజన్ లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత సీజన్ లో ఏకంగా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్ 2018 నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రతి సంవత్సరం ఈసారి కప్ మాదే అంటూ సీజన్ ని ప్రారంభించడం.. చివరకు బోల్తాపడడం ఈ జట్టుకు అలవాటుగా ఉండేది. కానీ ఐపీఎల్ 2025 లో తొలిసారిగా టైటిల్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తరలించింది ఆర్సిబి. ప్రతిసారి ట్రోఫీ గెలుస్తామని అంచనా వేయడం.. చివరకు బోల్తాపడడం, కోట్లలో నష్టాలు రావడంతోనే ఈ రెండు ఫ్రాంచైజీలు ఇప్పుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×