E-Paper
Advertisement

PBKS vs RR IPL 2024 Preview: నెంబర్ వన్ ప్లేస్‌లో సంజూ నిలబెడతాడా? నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్

PBKS vs RR IPL 2024 Preview: నెంబర్ వన్ ప్లేస్‌లో సంజూ నిలబెడతాడా? నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
Advertisement

Punjab Kings Vs Rajasthan Royals IPL 2024 Match Prediction: ఐపీఎల్ 2024 సీజన్ లో మ్యాచ్ లు నువ్వా నేనా? అన్నట్టు సాగుతున్నాయి. అడుగున ఉన్నవి పైకి రావడానికి చేస్తున్నాయి. మరిప్పుడు శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. మరి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో తలపడి ముందుకు రాగలదా? అనేది చూడాల్సిందే.

పంజాబ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఆర్ ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్ లు జరిగాయి. పంజాబ్ కింగ్స్ 11 గెలిస్తే, రాజస్థాన్ 15 మ్యాచ్ లు గెలిచింది. లెక్క ప్రకారం చూస్తే ఆర్ ఆర్ జట్టుదే పై చేయిగా ఉంది. 2024 సీజన్ లో చూస్తే  రాజస్థాన్ 5 మ్యాచ్ లు ఆడి 4 గెలిచి, ఒకటి ఓడిపోయింది. పంజాబ్ చూస్తే 5 మ్యాచ్ లు ఆడి 2 గెలిచి, మూడు ఓడిపోయింది.

Advertisement

పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడు ఆడుతున్నాడు గానీ, మిగిలినవాళ్లు పెద్దగా తనకి సపోర్టు ఇవ్వడం లేదు. రాజస్థాన్ విషయంలో కెప్టెన్ సంజూ శాంసన్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. తనకి మద్దతుగా మిగిలిన బ్యాటర్లు నిలుస్తున్నారు. దాంతో వాళ్లు అలవోకగా విజయం సాధించి ముందడుగు వేస్తున్నారు.

Also Read: విరాట్ మాట విన్న అభిమానులు పాండ్యా కి నిరసనల బదులు జేజేలు

Advertisement

బౌలింగ్ పరంగా చూస్తే ఆర్ఆర్ జట్టు చాలా బలంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, కేశవ్ మహరాజ్, ఆవేశ్ ఖాన్, యజ్వేంద్ర చాహల్, అశ్విన్, కుల్దీప్ సేన్ ఇలా పెద్ద లిస్టే ఉంది. బ్యాటింగ్ లో చూస్తే ఇంకా యశస్వి ఫామ్ లోకి  రాలేదు. వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా జాస్ బట్లర్ ఉన్నాడు. రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు. అందుకని ఆర్ ఆర్ కి తిరుగులేదనే చెప్పాలి.

ఇక పంజాబ్ విషయానికి వస్తే బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. పవర్ ప్లే లో, చివర డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో గెలవాల్సిన మ్యాచ్ ల్లో ఓటమి పాలవుతున్నారు.

మరి నేటి మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి అయితే పంజాబ్ కి ఉంది. ఆల్రడీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న ఆర్ ఆర్ తాజాగా ఒక మ్యాచ్ ఓడిపోయింది. అందుకని జాగర్త పడకపోతే, నెమ్మదిగా మెట్టు మెట్టు జారి కిందపడిపోవడం ఖాయమని చెప్పాలి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×