E-Paper
Advertisement

IPL 2026: బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌..పాకిస్తాన్ కు రూ.1000 కోట్ల న‌ష్టం ?

IPL 2026: బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌..పాకిస్తాన్ కు రూ.1000 కోట్ల న‌ష్టం ?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్  ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభ మ్యాచ్ లో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న తేదీ కంటే, కాస్త ఆలస్యంగా టోర్నమెంట్ ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మార్చి 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఐపిఎల్ 2026 టోర్నమెంట్ నిర్వహించాలని సన్నద్ధం అవుతుందట బీసీసీఐ. అయితే అదే రోజున పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహించాలని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు టోర్నమెంట్లు కూడా ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీలో మార్పులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మినీ వేలం డిసెంబర్ 16 అంటే నేడు జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. మార్చి 15వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించాలని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మార్చి 15 నుంచి మే 31వ తేదీ వరకు మొత్తం 84 మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కానీ ఏమైందో తెలియదు కానీ చివరి క్షణంలో బీసీసీఐ త‌న ప్లాన్ మార్చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అయ్యే రోజునే ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ట బీసీసీఐ. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది.

మే 3 తేదీ వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ జ‌రుగ‌నుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ ప్ర‌క‌టించి, పాకిస్తాన్ క్రికెట్ ముందుకు వెళుతోంది. విదేశాల్లో రోడ్ షోలు కూడా చేస్తూ, ప్ర‌చారం చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే, ఈ రెండు ఈవెంట్లు ఒకే రోజున ప్రారంభమై కొన‌సాగితే, తీవ్ర న‌ష్టం రెండు మెగా ఈవెంట్ల‌కు జ‌రిగే ఛాన్సులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. దాదాపు రూ.1000 కోట్ల న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు చెబుతున్నారు. బీసీసీఐ కావాల‌నే, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం రోజున ఐపీఎల్ ను ప్రారంభిస్తోంద‌ని కామెంట్స్ చేస్తున్నారు విశ్లేష‌కులు.

నేడే ఐపీఎల్ మినీ వేలం

Advertisement

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ కు సంబంధించిన మినీ వేలం ఇవాళ జ‌రుగ‌నుంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు ఈ మినీ వేలం అబుదాబి వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు. జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ లో వేలం చూడ‌వ‌చ్చును.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×