E-Paper
Advertisement

Prithvi Shaw: ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకుని, బ్యాట్ తో కొట్టిన పృథ్వీ షా

Prithvi Shaw: ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకుని, బ్యాట్ తో కొట్టిన పృథ్వీ షా
Advertisement

Prithvi Shaw:  టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే టీమిండియాలో అవకాశాలు రాక, ఐపీఎల్ అలాగే దేశ వారి క్రికెట్ ఆడుకుంటున్న పృథ్వీ షా ఏదో ఒక వివాదంలో చిక్కుకొని అడ్డంగా బుక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో క్రికెటర్ ను కొట్టబోయి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అదికూడా యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ పైన బ్యాట్ తో దాడి చేయబోయాడు పృథ్వీ షా (Prithvi Shaw). దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Gautam Gambhir: గంభీర్ మ‌హాముదురు.. ట్రోలింగ్ కు చెక్ పెట్టేందుకు బీరు, బిర్యానీలు పెట్టి మ‌రీ !

ముషీర్ ఖాన్ పైకి బ్యాట్ ఎత్తిన పృథ్వీ షా

Advertisement

రంజీ ట్రోఫీ సన్నాహక మ్యాచ్ లో పృథ్వీ షా  (Prithvi Shaw ) వర్సెస్ ముషీర్ ఖాన్ ( Musheer Khan ) మ‌ధ్య‌ గొడవ జరిగింది. ముంబై నుంచి మహారాష్ట్ర జట్టుకు మారిన పృథ్వీ షా తన మాజీ జట్టుపై తొలి మ్యాచ్ లోనే ఏకంగా సెంచరీ నమోదు చేశాడు. 181 పరుగులతో రెచ్చిపోయాడు. అయితే అనంతరం ముషీర్ ఖాన్ బౌలింగ్ లో పృథ్వీ షా ఔట్ అయ్యాడు. ఔట్ కాగానే అందరూ పెవిలియన్ కు వెళ్తారు. కానీ పృథ్వీ షా మాత్రం ఓవరాక్షన్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్ ముషీర్ ఖాన్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ముషీర్ ఖాన్ ఏదో అన్నాడని పృథ్వీ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అతనిపైకి బ్యాట్ ఎత్తి కొట్టబోయాడు. కాల‌ర్‌ కూడా పట్టుకున్నాడని తెలుస్తోంది. అయితే ముషీర్ ఖాన్ కు సంబంధించిన ప్లేయర్లు అందరూ ఏకమై, పృథ్వీ షాపై తిరగబడ్డారు. అంతలోనే అంపైర్లు రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ సంఘటన చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ముషీర్ ఖాన్, పృథ్వీ షాపై బ్యాన్ ?

Advertisement

టీమిండియా కు సంబంధించిన యంగ్ క్రికెటర్లు ముషీర్ ఖాన్ అలాగే పృథ్వీ షా ఇద్దరూ గొడవ ప‌డిన‌ సంగతి తెలిసిందే. ఈ గొడవలో ఇద్దరి తప్పిదం ఉన్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. ముషీర్ ఖాన్ గెలికితేనే పృథ్వీ షా రెచ్చిపోయాడని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు క్రికెటర్ల పై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక మ్యాచ్ లేదా రెండు మ్యాచ్‌ లు దేశవాళీ ట్రోఫీల్లో ఆడకుండా వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ఈ మ్యాచ్ లో 181 ప‌రుగులు చేసి రాణించాడు. అయితే, ఈ గొడ‌వ కార‌ణంగా పృథ్వీ షాకు నెగిటివ్ మార్క్ వ‌చ్చింది.

Also Read: Inzamam-ul-Haq: రోహిత్ శ‌ర్మ ఓ ముసలోడు, పందిలాగా ఉంటాడు…అందుకే కెప్టెన్సీ పీకిపారేశారు !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×