E-Paper
Advertisement

Prithvi Shaw: పృథ్వీ షాకు చేదు అనుభవం.. సెల్ఫీలు ఇవ్వలేదని దాడి..

Prithvi Shaw: పృథ్వీ షాకు చేదు అనుభవం.. సెల్ఫీలు ఇవ్వలేదని దాడి..
Advertisement

Prithvi Shaw: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీషాకు చేధు అనుభవం ఎదురైంది. అభిమానులు అతడిని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే పృథ్వీ అందరికీ సెల్ఫీలు ఇవ్వకపోవడంతో వాళ్లు అతని కారుపై దాడి చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

బుధవారం పృథ్వీషా తన స్నేహితుడు అశిశ్ సురేంద్రతో కలిసి ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లాడు. ఈక్రమంలో ఓ గ్యాంగ్ సెల్ఫీల కోసం పృథ్వీషాను చుట్టుముట్టింది. అయితే తనకు సమయం లేదని.. కేవలం ఇద్దరికి మాత్రమే సెల్ఫీ ఇస్తానని పృథ్వీషా వారితో చెప్పాడు. అయినా కూడా వారు వినకుండా ఇబ్బంది పెట్టడంతో.. అతని ఫ్రెండ్ ఆశిశ్ హోటల్ మేనేజర్‌ను పిలిచి కంప్లైంట్ చేశాడు.

Advertisement

దీంతో వారిపై కోపం పెంచుకున్న ఆ గ్యాంగ్ వారి కోసం హోటల్ బయట మకాం వేశారు. కారులో హోటల్ నుంచి బయటకు రాగానే బేస్‌బాల్ బ్యాట్లతో దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పృథ్వీ షా అతని స్నేహితునితో కలిసి మరో కారులో ఇంటికి వెళ్తుండగా.. ఓ మహిళ వాళ్లను వెంబడించింది. మధ్యలో వారి కారును అడ్డుకొని ఈ సమస్యను పరిష్కరించాలంటే తనకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తప్పుడు కేసులు పెడుతానని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది.

అయితే వాళ్లు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులు సనా అలియాస్ సప్నా గిల్, శోభిత్ ఠాకూర్‌లను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం 8 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×