E-Paper
Advertisement

Portugal : పోర్చుగల్ సూపర్ విక్టరీ

Portugal : పోర్చుగల్ సూపర్ విక్టరీ
Advertisement

Portugal : తీవ్ర ఉత్కంఠ, ఆటగాళ్ల ఘర్షణ మధ్య ఫిఫా వరల్డ్‌కప్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఘనాపై 3-2 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది… పోర్చుగల్. ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఒక గోల్ కొట్టి… ఏకంగా 5 ఫిఫా వరల్డ్‌కప్‌ల్లో గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2006, 2010, 2014, 2018, 2022 ఫిఫా వరల్డ్‌కప్‌ల్లో మొత్తం 8 గోల్స్ చేశాడు… రొనాల్డో.

ఇరు జట్లు తొలి అర్ధభాగంలో గోల్స్ చేయలేకపోవడంతో… మ్యాచ్ చప్పగా సాగింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం… ఆడుతున్నారా? లేక యుద్ధం చేస్తున్నారా? అన్నట్లు ఇరు దేశాల ప్లేయర్స్ తలపడ్డారు. ఆట 64వ నిమిషంలో స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డోను ఘనా ఆటగాడు మొరటుగా కింద పడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని రొనాల్డో చక్కగా సద్వినియోగం చేసుకుని గోల్ వేయడంతో… అక్కడి నుంచి మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య మలుపులు తిరుగుతూ సాగింది. ఆ తర్వాత 73వ నిమిషంలో ఘన ఆటగాడు అండ్రూ అవియు… ఫీల్డ్‌ గోల్‌ చేసి 1–1తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకే ఆధిక్యం మారింది. పోర్చుగల్ ఆటగాళ్లు జొవో ఫెలిక్స్‌ 78వ నిమిషంలో, రాఫెల్‌ లియో 80వ నిమిషంలో ఫీల్డ్‌ గోల్స్‌ చేయడంతో… ఆ జట్టు 3–1 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెగ్యులర్‌ టైమ్‌ కాసేపట్లో ముగుస్తుందనగా… 89వ నిమిషంలో ఘనా ఆటగాడు ఉస్మాన్‌ బుకారి హెడర్‌తో అద్భుతమైన గోల్‌ కొట్టాడు. దాంతో పోర్చుగల్ ఆధిక్యం 3-2కు తగ్గింది. ఇంజ్యూరి టైమ్‌లో మరో గోల్ కొట్టి స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ఆఖరి క్షణం దాకా పోర్చుగల్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ… పోర్చుగల్‌ డిఫెండర్లు వాళ్ల ప్రయత్నాల్ని సమర్థంగా అడ్డుకున్నారు.

Advertisement

ఈ మ్యాచ్‌లో రొనాల్డోను ఘనా ఆటగాడు కింద పడేసిన దగ్గరి నుంచి… రెండు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం కనిపించింది. రిఫరీ ఏకంగా ఆరు సార్లు ఎల్లో కార్డు చూపి ఆటగాళ్లను హెచ్చరించాడు. పోర్చుగల్‌ జట్టులో ఇద్దరు, ఘనా టీమ్ లో నలుగురిని రిఫరీ హెచ్చరించాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×