E-Paper
Advertisement

Ravindra Jadeja Updates : ఫరెవర్ క్రష్’తో జడేజా ఫోటో..

Ravindra Jadeja  Updates : ఫరెవర్ క్రష్’తో జడేజా ఫోటో..
Advertisement
Ravindra Jadeja  Updates

Ravindra Jadeja Updates : సినిమాల్లో ఉన్నట్టుగానే క్రికెట్‌లో కూడా ఫ్యాన్ వార్స్ సహజం. కానీ క్రికెట్ విషయానికొస్తే.. అది ప్లేయర్ వర్సెస్ టీమిండియా ఫ్యాన్స్ అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ప్లేయర్ వల్ల టీమిండియా ఓడిపోతే ఫ్యాన్స్ ఆగ్రహానికి అడ్డు ఉండదు. అంతే కాకుండా క్రికెటర్ల ప్రవర్తనలో చిన్న చిన్న విషయాలు కూడా ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తుంటాయి. అలా ఫ్యాన్స్ కోపాన్ని చాలా ఎక్కువసార్లు చూసిన క్రికెటర్ రవీంద్ర జడేజా. తాజాగా ఈ క్రికెటర్ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

రవీంద్ర జడేజా.. టీమిండియాలోని బెస్ట్ ఆల్ రౌండర్స్‌లో ఒకరు అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌లోనే కాదు.. టెస్ట్ క్రికెట్‌లో కూడా తన ఆటతో ఎన్నోసార్లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియాకు పోటీగా బోర్డర్ గవాస్కర్ ట్రాఫీలో జడేంద్ర కనబరిచిన ఆటతీరు.. ఎన్నో ఏళ్లు క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది. అయితే జడేజా.. తన జీవితంలో ఎక్కువశాతం క్రికెటే ఉంటుందని పలుమార్లు ప్రకటించినా.. అది కాకుండా తనకు వేరే కాలక్షేపాలు కూడా ఉంటాయి. వాటి గురించి అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు కూడా.

రవీంద్ర జడేజాకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తానే స్వయంగా చాలాసార్లు ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తాజాగా తనకు ఇష్టమైన గుర్రంతో దిగిన ఫోటోను ‘ఫరెవర్ క్రష్’ అనే ట్యాగ్‌తో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు జడేజా. ఇందులో రెడ్ టీషర్ట్‌తో చాలా కూల్‌గా, హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఇప్పటకీ ఐపీఎల్‌లో చివరి షాట్‌తో తన టీమ్ సీఎస్‌కేకు ట్రాఫీ తెచ్చిపెట్టిన జడేజా ఆటతీరును ఇప్పటికీ ఫ్యాన్స్ మర్చిపోలేదు. అందుకే తన పోస్ట్‌కు ఎక్కువగా ఐపీఎల్ ట్రాఫీ గురించే కామెంట్స్ పెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×